పోలీస్ సిబ్బంది సమస్యలకు తక్షణ పరిష్కారం
నగరంపాలెం (గుంటూరు వెస్ట్) : పోలీస్ సిబ్బంది సమస్యలకు నిర్ణీత వేళల్లో పరిష్కారం చూపుతామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీఓ) శుక్రవారం పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే నిర్వహించారు. వ్యక్తిగత, సర్వీస్, బదిలీలు, పరిపాలనా సమస్యలపై వినతులు అందించారు. పదిహేను మంది వినతులు అందించగా, వారి సమస్యలను జిల్లా ఎస్పీ అలకించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదు నిర్ణీత వేళలో పరిష్కారమయ్యేలా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పారు.


