ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి మృతి
పిడుగురాళ్ల: అర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఓ ప్రయాణికుడు శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. గుంటూరు నుంచి మాచర్ల వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సులో ప్రయాణిస్తున్న కాండ్రు శివప్రసాద్(69) పిడుగురాళ్ల పట్టణ సమీపానికి రాగానే ఒక్కసారిగా గుండెపోటుతో పడిపోయాడు. గమనించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ పిడుగురాళ్ల పట్టణంలోని కళ్లం టౌన్‌షిప్ సమీపంలో బస్సు ఆపి చూసే సరికి అప్పటికే పరిస్థితి విషమించటంతో అంబులెన్స్‌కు సమాచారం అందించి బంధువులు హుటాహుటిన పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే శివప్రసాద్ మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటనపై పిడుగురాళ్ల ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లును వివరణ కోరగా పిడుగురాళ్ల బస్సు కాదని, మాచర్ల డిపోకు చెందిన అద్దె బస్సు గుంటూరు నుంచి మాచర్ల వెళుతుండగా ఈ సంఘటన జరిగినట్లు సమాచారం తెలిసిందన్నారు.


