వర్సిటీ పురుషుల వాలీబాల్ జట్టు ఎంపిక
నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పురుషుల వాలీబాల్ జట్టు ఎంపిక చేసినట్టు కృష్ణవేణి కళాశాల ప్రిన్సిపాల్, వర్సిటీ అంతర్ కళాశా లల పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు తెలిపారు. కళాశాలలో శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు రోజులుగా కళాశాలలో నిర్వహించిన టోర్నమెంట్‌లో క్రీడాకారుల ఆట తీరు, ఫిట్‌నెస్, నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకొని 14 మందితో జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్టు వివరించారు. జట్టులో ఐ.కళ్యాణ్‌కుమార్, ఏ.ఉమామహేశ్వరరావు, ఎం.మణికంఠ, జె.నితిన్‌కుమార్ (కృష్ణవేణి డిగ్రీ కళా శాల, నరసరావుపేట), బి.మనోజ్, పి.శ్రీను, సీహెచ్.కోటి, వి.శంకర్ (వర్సిటీ వ్యాయామ కళాశాల, ఏఎన్‌యూ), బి.విజయ్‌కుమార్‌రెడ్డి, డి.బాలరెడ్డి (బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, బాపట్ల), షేక్.ఉస్మాన్ (ధనలక్ష్మీ వ్యాయామ కళాశాల, ముప్పాళ్ల), కె.శేఖరబాబు ( ఏిపీఆర్‌డీసీ, నాగార్జునసాగర్), బి.వెంకటేష్ (కేబీఆర్ కళాశాల, నరసరావుపేట), వై.అశోక్‌బాబు, (వేద ఫార్మసీ కళాశాల) ఎంపికయ్యారు. స్టాండ్‌బైగా వై.కుమార్, ఎన్.సబీర్, సయ్యద్ అబ్బాస్, కె.భానుప్రకాష్‌ను ఎంపిక చేసినట్టు తెలిపారు. ఎంపికై న జట్టు డిసెంబర్ 10 నుంచి 14వ తేదీ వరకు జేఎన్‌టీయూ కాకినాడలో నిర్వహించనున్న సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల టోర్నమెంట్‌లో ఏఎన్‌యూ కు ప్రాతినిధ్యం వహిస్తుందని వివరించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య, సెలక్షన్ కమిటీ సభ్యులు డాక్టర్ పి.గౌరీశంకర్, డాక్టర్ పి.శ్రీనివాసరావు, జె.ప్రేమ్‌కుమార్, వర్సిటీ పరిశీలకుడు డాక్టర్ డి.సూర్యనారాయణరావు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎంఆర్‌కే సతీష్‌బాబు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈదర ఆదిబాబు పాల్గొన్నారు.


