డిసెంబర్ 7న భౌతికశాస్త్ర ఉపాధ్యాయులకు శిక్షణ
గుంటూరు ఎడ్యుకేషన్: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న భౌతికశాస్త్ర ఉపాధ్యాయులకు డిసెంబర్ 7న శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. శుక్రవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శిక్షణ తరగతుల పోస్టర్లు ఆవిష్కరించారు. ఈసందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ బ్రాడీపేట 2/6లోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఉదయం 9.30 గంటల నుంచి జరగనున్న శిక్షణ తరగతులకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు హాజరు కావాలని కోరారు. రాష్ట్ర స్థాయి సబ్జెక్టు నిపుణులైన ఆర్.శివనాగేశ్వరరావు, కె.కృష్ణసాయి, బుద్దా శ్రీనివాస్, ఆగస్థ్య ఫౌండేషన్ ప్రతినిధి నరేష్‌బాబు రీసోర్స్ పర్సన్లుగా వ్యవహరిస్తారని తెలిపారు. శిక్షణ తరగతులకు హాజరు కానున్న ఉపాధ్యాయులు 83099 65083, 90004 53600, 97035 79996 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జేవీవీ ప్రతినిధులు టి.జాన్‌బాబు, బి.ప్రసాద్, టీఆర్ రమేష్, ఎస్‌ఎం సుభానీ, గురవయ్య, ఇ. అనిల్‌కుమార్, షేక్ రెహ్మాన్, జి.శివపూర్ణయ్య పాల్గొన్నారు.


