జాతీయ స్విమ్మింగ్ పోటీలకు ఎస్‌ఎస్ అండ్ ఎన్ విద్యార్
నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ అండర్–19 స్విమ్మింగ్ పోటీలకు శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల విద్యార్థులు కె.శివసాకేత్, కె.రుద్రపతాప్ సైదులురెడ్డి ఎంపికైనట్టు కళాశాల ప్రిన్సిపాల్ ఎం.ఎస్.సుధీర్, వ్యాయామ అధ్యాపకుడు యక్కల మధుసూదనరావు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల స్విమ్మింగ్ పోటీలో శివసాకేత్ 200 మీటర్లు బటర్‌ఫై,్లరుద్రప్రతాప్ 4–100 మీటర్లు విభాగంలో ప్రతిభ చూపి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని వివరించారు. ఢిల్లీలో ఈనెల 30 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు జరగనున్న 69వ అండర్–19 జాతీయ స్కూల్‌గేమ్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్– 2025 పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులకు కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు కపలవాయి విజయకుమార్, నాగసరపు సుబ్బరాయగుప్త, జాయింట్ సెక్రటరీ ఊటుకూరి వెంకట అప్పారావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాససాయి అభినందించారు.
జాతీయ స్విమ్మింగ్ పోటీలకు ఎస్‌ఎస్ అండ్ ఎన్ విద్యార్


