రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపిక
కారంచేడు: ఈ నెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సత్యసాయి జిల్లా చిగిచెర్లలో జరగనున్న రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు కారంచేడు విద్యార్థులు ముగ్గురు ఎంపికై నట్లు పీడీ షేక్ మస్తానీ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రమైన కారంచేడులోని యార్లగడ్డ నాయుడమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వివరాలను తెలిపారు. పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థులు కె. వెంకటలక్ష్మి, కె. మహేశ్వరితో పాటు, ఆరో తరగతి చదువుతున్న కె. మానస అండర్ 14 బాలికల విభాగంలో ఎంపికయ్యారన్నారు. కొత్తపట్నం గమల్లపాలెం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో వీరు విజయం సాధించారని తెలిపారు. అలాగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికకావడంపై ఎంఈఓ ఎంవీ సత్యన్నారాయణ, మొలబంటి వెంకటేశ్వర్లు, హెచ్‌ఎం ఎం. సాంమ్రాంజ్య అభినందించారు. రాష్ట్రస్థాయిలో విజయం సాధించి పాఠశాలకు, కారంచేడు గ్రామానికి కూడా పేరు తీసుకురావాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.
గుంటూరు మెడికల్: బీజేపీ కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వై.వి.సుబ్బారావును నియమిస్తూ పార్టీ రాష్ట్రకార్యవర్గం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న తనను గుర్తించి, తనకు కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమార స్వామికి సుబ్బారావు కృతజ్ఞతలు తెలిపారు నిబద్ధత, నిజాయితీతో నిర్వర్తించి రైతుల సమస్యల పరిష్కారానికి అంకితంమవుతానని తెలిపారు.
రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ఎంపిక


