డ్వాక్రా నిధుల గోల్‌మాల్‌పై విచారణ
తెనాలి రూరల్: డ్వాక్రా గ్రూపునకు సంబంధించి బ్యాంకులో నెల నెలా చెల్లించాల్సిన నగదు పూర్తిగా జమ కాకపోవడం, సుమారు రూ. 8 లక్షలు పైగా అవకతవకలు జరగడంపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తెనాలి నందులపేట కవిరాజ పార్కు ప్రాంతంలోని ఓ డ్వాక్రా గ్రూపునకు మూడేళ్లగా క్రితం రూ. 15 లక్షల రుణం మంజూరైంది. సభ్యులందరూ ప్రతి నెల క్రమం తప్పకుండా 36 నెలల పాటు వాయిదాలు చెల్లించుకుంటూ వచ్చారు. అక్టోబరుతో వాయిదాల గడువు ముగియడంతో తమకు రావాల్సిన పొదుపు మొత్తం గురించి వాకబు చేయగా బ్యాంకుకు ఇంకా రూ.8 లక్షలు చెల్లించాల్సి ఉందని సభ్యులకు తెలిసింది. దీంతో అవాకై ్కన సభ్యులు జిల్లా కలెక్టరుకు, డీఎస్పీకి, సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై బుధవారం రాత్రి టూ టౌన్ పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు విచారిస్తున్నారు.
మేడికొండూరు: జాతీయస్థాయి హాకీ పోటీలకు మేడికొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థిని చిరతనగండ్ల అనూష ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం కె.జయప్రద తెలిపారు. ఈనెల 22 నుంచి 24 వరకు చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన స్కూల్ గేమ్స్‌లో అండర్–14 రాష్ట్రస్థాయి పోటీలలో ఉమ్మడి గుంటూరు జిల్లా తరఫున హాకీ పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగే జాతీయస్థాయి హాకీ పోటీలలో విద్యార్థిని పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయులు టి.వాణి సునీల, కె.బాలకృష్ణ తెలిపారు. అనూషను గ్రామ సర్పంచ్ పూల నాగమణి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ షేక్ ఆదాం ఉపాధ్యాయులు అభినందించారు.


