‘కొమ్మోజీ’కి స్వల్ప గాయాలు
కారంచేడు: యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజీ శ్రీనివాసరావుకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గురువారం ఆయన ఒంగోలు నుంచి కారంచేడు మండలంలోని స్వగ్రామమైన జరుబులవారిపాలెంలో తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. అక్కడి నుంచి ఆయన తన కారులో బాపట్లలో జరగనున్న జిల్లా కౌన్సిల్ సమావేశానికి హాజరవుతున్న తరుణంలో ప్రమాదం జరిగింది. ఆయన కారు కేశవరప్పాడు–స్వర్ణ గ్రామా ల మధ్య నాలుగు రోడ్ల కూడలి దాటిన తరువాత అదుపుతప్పి రోడ్డు పక్కన కాలువలోకి దూసుకుపోయింది.
ఈ ప్రమాదంలో ఆయన పక్కటెముకలకు గాయాలయ్యాయి. కారు పూర్తిగా దెబ్బతింది. స్థానిక యూటీఎఫ్ నాయకులు భవనం శ్రీనివాసరెడ్డి, పావులూరి శ్రీనివాసరావు, రావి పద్మావతి మరికొంత మంది సహకారంతో ఆయనను చీరాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు ప్రమాదం లేదని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు, జనవిజ్ఞానవేదిక రాష్ట్ర కార్యదర్శి కుర్రా రామారావు, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోని పలువురు ఉపాధ్యాయులు వచ్చి పరామర్శించారు.
అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు


