బైక్‌ను ఢీ కొన్న లారీ.. ఒకరి మృతి
మేదరమెట్ల: తిమ్మనపాలెం గ్రోత్ సెంటర్ నుంచి బల్లికురవకు వెళుతున్న లారీ ముందు వెళుతున్న మోటారు బైక్‌ను ఢీ కొన్న సంఘటన కొరిశపాడు మండలంలోని మేదరమెట్ల కొండసమీపంలో జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొనడంతో బైక్‌పై ఉన్న ఒకరు రోడ్డుపై పడిపోయాడు.
దీంతో రోడ్డుపై పడిన వ్యక్తిపై నుంచి లారీ వెనుక చక్రాలు వెళ్లడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న మరో వ్యక్తి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. సమాచారం తెలుసుకున్న మేదరమెట్ల ఎస్సై మహ్మద్ రఫీ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను సేకరించి లారీని అదుపులోకి తీసుకున్నారు. మృతుడి వయస్సు సుమారు 25 సంవత్సరాలు ఉంటుందని వివరాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసి మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.


