యూనివర్సిటీ గేమ్స్ టెక్నికల్ అఫీషియల్‌గా శ్రావణి
వేటపాలెం: ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్‌కు టెక్నికల్ అఫీషియల్‌గా వేటపాలెం హైస్కూల్ పీఈటీ శ్రావణి ఎంపికై నట్లు ఇన్‌చార్జి హెచ్‌ఎం ఉమ్మిటి వేణుగోపాలరావు గురువారం తెలిపారు. హెచ్‌ఎం మాట్లాడుతూ విశ్వ విద్యాలయ క్రీడలను ప్రోత్సహించే నిమిత్తం భారత ప్రభుత్వం 2020 నుంచి దేశంలోని యూనివర్శిటీ క్రీడాకారులకు వివిధ జాయతీ స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐదో ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ ఈ నెల 24 నుంచి డిసెంబరు 25 వరకు రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించనున్నారని తెలిపారు. అందులో భాగంగా డిసెంబర్ 1 నుంచి 5వ వరకు రాజస్థాన్‌లోని బికనీర్‌లో నిర్వహించే విశ్వవిద్యాలయ స్థాయి కబడ్డీ పోటీలకు పీఈటీ జరుబుల శ్రావణి టెక్నికల్ అఫిషయల్‌గా ఎంపికై నట్లు తెలిపారు. పీఈటీ సహా ఉపాధ్యాయులు అభినందించారు.


