హామీలు నెరవేర్చాలి
ఎన్నికల ముందు చేనేతలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు సర్కారు అమలు చేయాలి. నేతన్న నేస్తం వలన ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా లబ్ధిపొందాయి. అలాంటి నేతన్న నేస్తం అందకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. రెండు సంవత్సరాలుగా నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో చంద్రబాబు సర్కారు నేతన్నలకు ఆర్థిక సహాయం అందిస్తామని చెబుతుందే గానీ అమలు చేయలేదు. ప్రభుత్వం చెప్పిన హామీలనే నెరవేర్చాలని కోరుతున్నాం.
–– గద్దె హేమసుందర్, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు


