కోటి సంతకాల సేకరణకు తరలిన విద్యార్థి లోకం
పర్చూరు(చినగంజాం): వైద్యవిద్యను పేద విద్యార్థులకు దూరం చేసే చంద్రబాబు సర్కార్ చర్యలను విద్యార్థి లోకం ఖండించింది. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగంగా బుధవారం పర్చూరు గ్రామంలో భవనం అంజిరెడ్డి తులబందుల అర్జునయ్య జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి మాచవరపు రవికుమార్ మాట్లాడుతూ పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు సర్కార్ కుట్రలు బద్దలు కొట్టే రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు విద్యార్థులు పెద్ద ఎత్తున కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యులై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి ఆదిపూడి వంశీ రామశర్మ, చల్లా శివారెడ్డి, అయ్యప్పరెడ్డి, షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు.


