ఎకరాకు రూ.10 వేలు నష్టం
దిగుబడితోపాటు ధర తగ్గించి అమ్మాల్సి రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎకరాకు కౌలు రూ.15 వేల నుంచి రూ.18 వేలు ఉండగా పెట్టుబడి రూ.25 నుంచి రూ.30 వేలు అవుతోంది. ఈ లెక్కన మొత్తం ఖర్చు రూ.50 వేలకు తగ్గడం లేదు. గతంలో ఎకరాకు 35 నుంచి 40 బస్తాలు దిగుబడి రాగా ఈ ఏడాది యూరియా కొరతతోపాటు అకాల వర్షాలతో 30 బస్తాలు మాత్రమే వస్తోంది. ప్రైవేటు వ్యాపారులకు రూ.1450 ప్రకారం అమ్ముకుంటే 30 బస్తాలకు రూ. 43,500 మాత్రమే వస్తోంది. పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు రూ.10 వేలకు తగ్గకుండా నష్టం వస్తుంది. బస్తా రూ.1792 చొప్పున ప్రభుత్వ మద్దతు ధరకు అమ్మితే ఎకరాకు రూ. 53,310 వస్తుంది. ప్రభుత్వ మద్దతు ధరకు అమ్మినా పెట్టుబడులు కూడా రావని కౌలు రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ధాన్యం తడవకుండా ప్లాస్టిక్ పట్టలు అందించి, ఆరబోసుకునేందుకు అవకాశం కల్పించడంతోపాటు, తక్కువ సమయంలో కొనేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు.


