తక్కువ ధరకే బంగారమంటూ మోసం
నగరంపాలెం: తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని మోసగించారంటూ ఓ టీడీపీ ఎంపీటీసీతో సహా పలువురు బాధితులు జిల్లా ఏఎస్పీ వద్ద వాపోయారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. బాధితుల నుంచి జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ రమణమూర్తి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదిదారుల సమస్యలను ఆలకించిన పోలీసు ఉన్నతాధికారులు సంబంధిత స్టేషన్ ఆఫీసర్లతో మాట్లాడారు. చట్ట పరిధిలో బాధితుల సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. డీఎస్పీలు బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), మధుసూదనరావు (సీసీఎస్)లు అర్జీలు స్వీకరించారు.
పీజీఆర్‌ఎస్‌లో బాధితుల ఫిర్యాదు
అర్జీలు స్వీకరించిన
జిల్లా ఏఎస్పీ రమణమూర్తి
తక్కువ ధరకే బంగారమంటూ మోసం


