కారుణ్య మరణం కోరిన శేషగిరమ్మ ఇంటికి వైద్యుల బృందం
తాడికొండ: రాజధానిలో కారుణ్య మరణం కోరిన నెల్లూరి శేషగిరమ్మ ఇంటికి సోమవారం 10 మంది వైద్యుల బృందం వెళళళ్లి ఆమెను పరిశీలించారు. శేషగిరమ్మ మనవరాలు చెరుకూరి శ్యామల శాశ్వత అంగవైకల్యంతో బాధపడుతుండటంతో ఆమెకు గత నెల 90 శాతం అంగవైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆమెకు రూ.6 వేల పింఛన్ అందజేశారు. దీనిపై వైద్యుడిని నేరుగా తమ ఎదుట హాజరుకావాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జీజీహెచ్ వైద్య బృందం సోమవారం వృద్ధురాలి గృహాన్ని సందర్శించారు.


