జాతీయ కబడ్డీ, వాలీబాల్‌ పోటీలకు శ్రావణి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ కబడ్డీ, వాలీబాల్‌ పోటీలకు శ్రావణి ఎంపిక

Nov 23 2025 6:13 AM | Updated on Nov 23 2025 6:13 AM

జాతీయ కబడ్డీ, వాలీబాల్‌ పోటీలకు శ్రావణి ఎంపిక

జాతీయ కబడ్డీ, వాలీబాల్‌ పోటీలకు శ్రావణి ఎంపిక

వేటపాలెం: స్థానిక జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాల పీఈటీ జరుబుల శ్రావణి జాతీయ స్థాయి కబడ్డీ, వాలీబాల్‌ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం దేవరకొండ సరోజిని శనివారం తెలిపారు. ఈ నెల 20, 21వ తేదీన విజవాయడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాష్ట్రస్థాయి సివిల్‌ సర్వీసెస్‌ గేమ్స్‌ నిర్వహించారని తెలిపారు. ఈ పోటీల్లో శ్రావణి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. త్వరలో జరిగే సివిల్‌ సర్వీసెస్‌ గేమ్స్‌లో రాష్ట్రం తరఫున పాల్గొంటారన్నారు. శ్రావణిని హెచ్‌ఎం, సహఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. జాతీయ పోటీల్లో కూడా రాణించాలని వారు ఆకాంక్షించారు.

పది పరీక్షల షెడ్యూల్‌ విడుదల

నరసరావుపేట ఈస్ట్‌: పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలు 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ శనివారం తెలిపారు. మార్చి 16వ తేదీన ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 18న సెకండ్‌ లాంగ్వేజ్‌, 20న ఇంగ్లిష్‌, 23న గణితం, 25న ఫిజిక్స్‌, 28న బయోలజీ, 30న సాంఘికశాస్త్రం, 31న ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–2, ఏప్రిల్‌ 1న ఒకేషనల్‌ కోర్సు పరీక్ష ఉంటుందని వివరించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ వివరాలను యుడైస్‌ వెబ్‌సైట్‌లో సరిచూసుకోవాలని తెలిపారు. ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకు వెళ్లి సరిచేసుకోవాలని సూచించారు. పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించాలని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే అధికంగా వసూలు చేసే పాఠశాలలపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.

శ్రీసత్యసాయి అన్నప్రసాద వితరణ

నరసరావుపేట ఈస్ట్‌: శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం శ్రీసత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. బస్టాండ్‌ సెంటర్‌, సతైనపల్లిరోడ్డు మహాలక్ష్మమ్మ చెట్టు, పల్నాడు బస్టాండ్‌ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద కేంద్రాలలో దాదాపు 8వేల మందికి ప్రసాదం అందించారు. శ్రీసత్యసాయి భజన మండలి కన్వీనర్‌ కూనిశెట్టి సత్యసాయి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలి సభ్యులు, సీ్త్ర సేవాదళ్‌ సభ్యులు సేవలు అందించారు. ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగసరపు సుబ్బరాయగుప్త, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు వనమా సాంబశివరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement