ఖోఖో పోటీలకు తొమ్మిది మంది ఎంపిక
జె.పంగులూరు: స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18న అండర్–17 విభాగంలో ఖోఖో జట్టు ఎంపికలు సింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగాయి. 12 మంది జట్టులో స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల నుంచి తొమ్మిది మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. ఎస్‌ఆర్‌ఆర్ పంగులూరు ఖోఖో అకాడమీలో గత మూడు నెలలుగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ క్రీడాకారులు ఈ నెల 22 నుంచి 24 వరకు కాకినాడలో జరిగే స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర స్థాయి అండర్–17ఖోఖో పోటీల్లో పాల్గొంటారని ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ చెక్కా వెంకటేశ్వర్లు తెలిపారు.


