జిల్లా కోర్టులో న్యాయదేవత విగ్రహావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

జిల్లా కోర్టులో న్యాయదేవత విగ్రహావిష్కరణ

Nov 22 2025 7:06 AM | Updated on Nov 22 2025 7:06 AM

జిల్ల

జిల్లా కోర్టులో న్యాయదేవత విగ్రహావిష్కరణ

జిల్లా కోర్టులో న్యాయదేవత విగ్రహావిష్కరణ గుంటూరు లీగల్‌: జిల్లా కోర్టు ప్రధాన ద్వారం వద్ద న్యాయదేవత విగ్రహాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్‌ చక్రవర్తి శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్‌ పులి శ్రీనివాసులు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సబ్‌జైలును తనిఖీ చేసిన జైళ్ల శాఖ డీజీపీ నరసరావుపేట టౌన్‌: ప్రత్యేక ఉప కారాగారాన్ని రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ అంజన్‌ కుమార్‌ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిమాండ్‌ ఖైదీల యోగక్షేమాలు విచారించారు. ఆహారం, వైద్యం, పారిశుద్ధ్యం తదితర అంశాలను పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. రికార్డులు తనిఖీ చేశారు. సిబ్బంది క్రమశిక్షణ తదితర అంశాలపై ఆరా తీశారు. సబ్‌ జైలు నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట సబ్‌ జైలర్‌ అంజయ్య, సిబ్బంది ఉన్నారు. ఆలయ రాతి నిర్మాణానికి రూ.2 లక్షలు విరాళం కార్తికమాసం కోటప్పకొండ ఆదాయం రూ.2.18 కోట్లు గ్రావెల్‌ అక్రమ తవ్వకాలను అడ్డుకున్న స్థానికులు

నరసరావుపేట ఈస్ట్‌: సత్తెనపల్లి రోడ్డు పులపులవారి వీధిలో వేంచేసియున్న శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రాతి నిర్మాణానికి వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ కమిటీ కార్యదర్శి కొత్తమాసు వెంకటప్పయ్య, ప్రేమలత దంపతులు రూ.2,01,116 విరాళంగా అందించారు. ఆలయంలో శుక్రవారం పూజలు నిర్వహించిన దాతలు విరాళాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులు వనమా సాంబశివరావు, కోవూరి శివశ్రీనుబాబు, గజవల్లి మురళిలకు అందించారు. మోదుగుల చంద్రం రూ.11,116 విరాళంగా అందించారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు వనమా కృష్ణ, రాచూరి వెంక టేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నరసరావుపేట రూరల్‌: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి కార్తిక మాసంలో రూ.2.18 కోట్లు ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో డి.చంద్రశేఖర్‌ తెలిపారు. ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆదాయ వివరాలను ఈవో వెల్లడించారు. ఆస్ట్రేలియా డాలర్స్‌ 10, సింగపూర్‌ డాలర్స్‌ 10, అమెరికా డాలర్‌, 28 గ్రాముల బంగారం, 115 గ్రాముల వెండి హుండీల ద్వారా లభించినట్టు తెలిపారు.

యడ్లపాడు: గ్రావెల్‌ అక్రమ తవ్వకాలను ఉప్పరపాలెం గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. వంకాయలపాడు రెవెన్యూ పరిధిలో గురుకుల పాఠశాల సమీపంలో తవ్వకాలు నిర్వహిస్తున్న ప్రాంతానికి చేరుకుని గ్రావెల్‌ లోడుతో వెళ్తున్న వాహనాలను నిలుపుదల చేశారు. తమ గ్రామం పరిధిలోని ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు చేస్తే సహించబోమంటూ ఆగ్రహించారు. అడ్డుకున్న వారిలో గ్రామస్తులు పల్లపు వీర్ల అంకమ్మ, పల్లపు వెంకట్రావు, గుంజి శ్రీనివాసరావు, వల్లెపు అంకమ్మబాబు ఉన్నారు.

జిల్లా కోర్టులో న్యాయదేవత విగ్రహావిష్కరణ  
1
1/4

జిల్లా కోర్టులో న్యాయదేవత విగ్రహావిష్కరణ

జిల్లా కోర్టులో న్యాయదేవత విగ్రహావిష్కరణ  
2
2/4

జిల్లా కోర్టులో న్యాయదేవత విగ్రహావిష్కరణ

జిల్లా కోర్టులో న్యాయదేవత విగ్రహావిష్కరణ  
3
3/4

జిల్లా కోర్టులో న్యాయదేవత విగ్రహావిష్కరణ

జిల్లా కోర్టులో న్యాయదేవత విగ్రహావిష్కరణ  
4
4/4

జిల్లా కోర్టులో న్యాయదేవత విగ్రహావిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement