హెల్మెట్ ధరించిన వారికి స్వీట్లు
కర్లపాలెం: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు రోడ్డు నిబంధనలపై వినూత్న పద్ధతిలో వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నామని బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ, కర్లపాలెం ఎస్‌ఐ రవీంద్ర తెలిపారు. గురువారం కర్లపాలెం పంచాయతీ పరిధిలోని సత్యవతీపేట గ్రామం వద్ద జాతీయ రహదారిపై కర్లపాలెం ఎస్‌ఐ రవీంద్ర ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టి రోడ్డు నిబందనలపై వాహన చోదకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర మోటారు వాహనాలు నడుపుథఉన్న వారికి సీఐ హరికృష్ణ, ఎస్‌ఐ రవీంద్రలు స్వీట్లు పంపిణీ చేశా రు. హెల్మెట్ లేనివారికి జరిమానా విధించారు. ఈ సందర్భంగా సీఐ, ఎస్‌ఐ మాట్లాడుతూ ప్రయాణికులందరూ సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలనే లక్ష్యంతోనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.


