కర్లపాలెం: తమ పాఠశాల విద్యార్థులు జిల్లా ఫెన్సింగ్ జట్టుకు ఎంపికయ్యారని హైవెండ్ హైస్కూల్ ఎండీ బొడ్డు సాయి మహేంద్రబాబు గురువారం తెలిపారు. గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన జరిగిన జిల్లా జట్టు ఎంపిక పోటీలలో తమ పాఠశాల విద్యార్థులు భానుచంద్రారెడ్డి, చరవాణి మెరుగైన ప్రతిభ కనబరిచి జిల్లా జట్టుకు ఎంపికయ్యారని ఆయన వివరించారు. ఈనెల 24, 25, 26 తేదీల్లో కోనసీమ జిల్లా మోరి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలలో తమ విద్యార్థులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల చైర్మన్ ఉదయ్‌చంద్రరావు, డైరెక్టర్‌లు వెంకటజ్యోతి, చాందినీ, ఉపాధ్యాయులు అభినందించారు.
బాపట్ల: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ విభాగ అధికార ప్రతినిధిగా డాక్టర్ విలియం జాన్ హైబెల్స్ బోడా(నాని)ని నియమించారు. బాపట్ల నియోజకవర్గానికి చెందిన విలియం జాన్ హైబెల్స్ బోడా(నాని)కి ఈ పదవి దక్కటంతో పలువురు అభినందించారు.


