శ్రీరామ సైనిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
కొల్లూరు : గుజరాత్‌లోని పఠాన్ జిల్లాలో ఈ నెల 14 నుంచి 17 వరకు జరిగిన 10వ సబ్ జూనియర్ డాడ్జ్ బాల్ జాతీయ స్థాయి పోటీలలో ద్వితీయ స్థానం సాధించిన రాష్ట్ర జట్టులో కొల్లూరు మండలం శ్రీరామ సైనిక్ స్కూల్ విద్యార్థులు 8 మంది ప్రాతినిధ్యం వహించి విజయంలో కీలక పాత్ర పోషించారని పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొలసాని శ్రీకాంత్ తెలిపారు. జట్టు గెలుపులో శ్రీరామ విద్యార్థులు కె. లిఖిత్, డి. జస్వంత్, యు. జస్వంత్, జి. విహాన్, కె. ధీరజ్, జి. నితిన్‌రామ్ చౌదరి, ఎస్‌కె. మాఖిల్ షోయబ్, ఎం. విఠల్ అదిత్యలను ఈ సందర్భంగా అభినందించారు. డాడ్జ్ బాల్ జాతీయ స్థాయి పోటీలలో రాష్ట్ర జట్టు రాణించడంలో కీలకంగా వ్యవహరించిన కోచ్‌లు ఎస్‌కే అప్‌రోజ్, ఎం. సుబ్బారావు, వి. విష్ణులను రాష్ట్ర డాడ్జ్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.


