కొత్తపాలెం పోలేరమ్మ ఆలయంలో చోరీ | - | Sakshi
Sakshi News home page

కొత్తపాలెం పోలేరమ్మ ఆలయంలో చోరీ

Nov 20 2025 7:28 AM | Updated on Nov 20 2025 7:28 AM

కొత్త

కొత్తపాలెం పోలేరమ్మ ఆలయంలో చోరీ

బల్లికురవ: బల్లికురవకు కూతవేటు దూరంలో ఉన్న కొత్తపాలెం పోలేరమ్మ ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. బల్లికురవ నుంచి అద్దంకి వెళ్లే ఆర్‌ అండ్‌ బీ రోడ్డుకు పడమర భాగంలో ఇటీవల పోలేరమ్మ ఆలయాన్ని నిర్మించారు. మంగళవారం రాత్రి అర్చకులు పూజాది కార్యక్రమాల అనంతరం ఆలయం తలుపులు మూసివేశారు. బుధవారం ఉదయం ఆలయంలోకి అర్చకుడు వెళ్లగా తలుపులు తెరచి ఉన్నాయి. ఈ విషయాన్ని ఆలయ కమిటీకి తెలియజేశాడు. వారు వచ్చి హుండీ, రెండు గంటలు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ వై. నాగరాజు సిబ్బందితో వచ్చి ఆలయాన్ని, స్థానిక నాలుగు రోడ్ల కూడలిలోని సీసీ కెమెరాలను పరిశీలించారు.

చంద్రమౌళీశ్వరునికి విశేషాభిషేకాలు

నకరికల్లు: నర్శింగపాడులోని శ్రీ గంగా అన్నపూర్ణా సమేత మరకతలింగ చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో లక్ష బిళ్వార్చన వేడుకలు బుధవారం కనుల పండువలా సాగాయి. అర్చకులు పమిడిమర్రు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజాధికాలు జరిపించారు. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అభిషేకాలు చేశారు. చండీపారాయణం, రుద్రహోమం, చండీహోమం, అమ్మవారికి కుంకుమపూజలు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి విశేష పూజల్లో పాల్గొన్నారు.

బగళాముఖి ఆలయానికి ఐఎస్‌ఓ 9001 అవార్డు

చందోలు(కర్లపాలెం): చందోలు బగళాముఖి అమ్మవారి ఆలయానికి హైమ్‌ ఇంటర్నేషనల్‌ ఐఎస్‌వో 9001 అవార్డు రావటం బాపట్ల జిల్లాకే తలమానికమని ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ అన్నారు. హైమ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ మేనేజింగ్‌ డైరక్టర్‌ ఆలపాటి శివయ్య ఆధ్వర్యంలో బుధవారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో హైమ్‌ ఇంటర్నేషనల్‌ ఐఎస్‌వో 9001 అవార్డును ఆలయ మేనేజర్‌ నరసింహమూర్తికి ఎమ్మెల్యే నరేంద్రవర్మ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా హైమ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆలపాటి శివయ్య మాట్లాడుతూ చందోలు బగళాముఖి అమ్మవారి చరిత్ర తెలుసుకుని అవార్డు అందజేశామని తెలిపారు. అనంతరం శాసనసభ్యులు నరేంద్రవర్మరాజు, ఆలపాటి శివయ్యలను ఆలయ మేనేజర్‌, అభివృద్ధి కమిటీ సభ్యులు సన్మానించారు. ఆలయ పాలకమండలి చైర్మన్‌ కలకోట చక్రధర్‌రెడ్డి, సభ్యులు పట్టాభిరామారావు, ప్రసాద్‌, ఆలయ అర్చకులు ఉన్నారు.

నువ్వులు, వేరుశనగల దిగుబడి పెంపునకు శిక్షణ

గుంటూరు రూరల్‌: ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నూనె గింజల పరిశోధన స్థానం హైదరాబాద్‌ ఆర్థిక సహకారంతో బుధవారం లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ ఆర్‌. శారదజయలక్ష్మి మాట్లాడుతూ నువ్వులు, వేరుశనగ పంటల్లో దిగుబడిని పెంచే దిశగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలి పారు. రైతులు నూనె గింజల పంటలను విరివిగా చేపట్టి భారతదేశ వంటనూనెల దిగుమతులను తగ్గించాలని కోరారు. విస్తరణ సంచాలకులు డాక్టర్‌ శివన్నారాయణ వేరుశనగలో మేలైన యాజమాన్య పద్ధతులు వివరించారు. పలువురు శాస్త్రవేత్తలు పురుగులు, తెగుళ్లు , యాజమాన్యం గురించి వివరించారు.

కొత్తపాలెం పోలేరమ్మ ఆలయంలో చోరీ  1
1/3

కొత్తపాలెం పోలేరమ్మ ఆలయంలో చోరీ

కొత్తపాలెం పోలేరమ్మ ఆలయంలో చోరీ  2
2/3

కొత్తపాలెం పోలేరమ్మ ఆలయంలో చోరీ

కొత్తపాలెం పోలేరమ్మ ఆలయంలో చోరీ  3
3/3

కొత్తపాలెం పోలేరమ్మ ఆలయంలో చోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement