కదిలిస్తే కన్నీరే..! | - | Sakshi
Sakshi News home page

కదిలిస్తే కన్నీరే..!

Nov 2 2025 9:38 AM | Updated on Nov 2 2025 9:38 AM

కదిలి

కదిలిస్తే కన్నీరే..!

కదిలిస్తే కన్నీరే..! మోంథా తుఫాన్‌ వేళ పాలకుల నిర్లక్ష్యంపై ప్రజల ఆవేదన ఆదివారం శ్రీ 2 శ్రీ నవంబర్‌ శ్రీ 2025 సాక్షి ప్రతినిధి, బాపట్ల : మోంథా తుఫాన్‌ ప్రభావంతో ఈ నెల 27, 28వ తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, మినుము, సోయాబీన్‌, అరటి, బొప్పాయితోపాటు కూరగాయల పంటలు 90 వేల ఎకరాల్లో నీటమునిగాయి. అయిదు రోజులవుతున్నా పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో 60 వేల ఎకరాల వరిపంట నీటిలోనే ఉండి కుళ్లిపోతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంటలు పాడైపోవడంతో రైతులకు రూ. 500 కోట్లమేర నష్టం వాటిల్లింది. చెట్లు నేలకొరిగి రెండురోజులపాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వంకలు పొంగిపొర్లి అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఇప్పటికీ లోతట్టు కాలనీలు నీటిలోనే ఉన్నాయి. తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముందస్తు చర్యలు తీసుకున్నామని, తుఫాన్‌ వలన ప్రజలకు ఇబ్బందులు లేవని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. బాపట్ల, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోని అనేక ప్రాంతాల్లో సాక్షి బృందం జరిపిన పరిశీలనలో తుఫాను ఇక్కట్లను జనం ఏకరువు పెట్టారు. సర్కారు నిర్లక్ష్యాన్ని తూర్పారబట్టారు. ఎటు చూసినా ముంపులోనే పొలాలు ఉదయాన్నే బాపట్ల నుంచి మూలపాలెం వెళ్లే దారిలో ఇప్పటికీ నీటిలో మునిగి ఉన్న వరిపొలాలు కనిపించాయి. అక్కడే ఉన్న భీమవారిపాలెం రైతు జిట్టా మురళిని పలకరించగా.. రెండున్నర ఎకరాల సొంత పొలంతోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేసినట్లు పేర్కొన్నారు. తుఫాన్‌ దెబ్బకు ఇప్పటికీ రెండు ఎకరాల పొలం నీటిలోనే ఉందన్నారు. నీరు బయటకుపోయే మార్గం లేకపోవడంతో పొట్ట దశలో ఉన్న పైరు కుళ్లిపోతోందని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మిగిలిన రైతులు కూడా తుఫాను కష్టాలు ఏకరువు పెట్టారు. మూలపాలెం నుంచి జిల్లెళ్ళమూడి, జమ్ములపాలెం వెళ్లిన బృందానికి నల్లమడవాగు పొంగిపొర్లడంతో ఇప్పటికీ నీటిలో మునిగి ఉన్న పంటపొలాలు కనిపించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా కాలువల్లో పూడిక తీయకపోవడంతో వరదలు వచ్చినప్పుడు పొలాలు ముంపునకు గురవుతున్నాయని రైతు మేలిమి శ్రీనివాసరావు తెలిపారు. ఆయనతోపాటు అదే గ్రామానికి చెందిన పలువురు రైతులు ఈ విషయాన్నే చెప్పారు. కూటమి సర్కార్‌పై మండిపడ్డారు. ఇళ్లను చుట్టుముట్టిన వరద జమ్ములపాలెం నుంచి బాపట్ల పట్టణ శివారులో ఇప్పటికీ నీటిలో ఉన్న గంగపుత్రుల కాలనీకి వెళ్లి గొల్ల జాలమ్మను పలకరిస్తే నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి అని వాపోయారు. విషసర్పాలు సంచరిస్తున్నాయన్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయం భయంగా బతుకుతున్నామని వాపోయారు. ఏ అధికారీ తమ కాలనీవైపు తొంగిచూడలేదన్నారు. అదే కాలనీలో కొండపాటూరు స్వప్న, శ్రీనివాసరావులు కాలనీ దుస్థితిని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తరువాత పర్చూరు నియోజకవర్గం కారంచేడుకు చేరుకున్న బృందానికి కుంకలసురజను కాలువ రోడ్డులో ఉన్న నువ్వుల శ్రీనివాసరావు దిగులుగా కనిపించారు. ఏంటని పలకరిస్తే తనకు ఉన్న ఒక్క ఎకరంతోపాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశానని చెప్పారు. కొత్తగా వేసిన వాడరేవు పిడుగురాళ్ళ జాతీయ రహదారి సక్రమంగా నిర్మించకపోవడంతో వరద వచ్చి పంటను ముంచిందన్నారు. రూ.లక్ష వరకు నష్టపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి నీటిలోనే ఉన్న అంబేడ్కర్‌ నగర్‌ ఆరవ కాలనీకి వెళ్లగా బయట సిమెంట్‌ బల్లపై కూర్చొని కుమ్మరి సుహాసిని కనిపించారు. ఓట్ల సమయంలోనే తాము గుర్తుకు వస్తామని, తరువాత తమ గోడు పట్టించుకొనే వారు కరువయ్యారని వాపోయారు. 30 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ కాలనీలో 30 కుటుంబాలు ఉంటున్నా వసతులు లేవని చెప్పారు. వర్షం పడితే ఇళ్లలోకి పాములు, తేళ్లు వస్తుంటాయని వాపోయారు. వాటి వలన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. పక్కనే ఉన్న సునీతను పలకరించగా.. తుపాను సమయంలో పునరావాస కేంద్రానికి తీసుకెళ్లి అధికారులు పెట్టిన అన్నం తిన్న వారందరికీ కడుపునొప్పి, విరేచనాలు అయ్యాయని పేర్కొన్నారు. ఆ సెంటర్లోకి వరద నీరు వచ్చిందని మరో చోటుకు తీసుకొచ్చారని వాపోయారు. అక్కడ కూడా సరైన వసతులు కల్పించలేదని తెలిపారు.

న్యూస్‌రీల్‌

తినడానికి తిండి కూడా లేదు..

అక్కడి నుంచి రోడ్డు మీదకు వచ్చి కూలి పనులకు వెళ్తున్న కోటా సుభాషిణిని పలకరిస్తే.. తుఫాను దెబ్బకు నాలుగు రోజులుగా కూలి పసులు లేవని చెప్పారు. పునరావాస కేంద్రంలో ఉంటేనే ఆహారం, లేకుంటే లేదని అధికారులు చెప్పారని తెలిపారు. ఇంట్లో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. కాలువ సెంటర్‌లో ఆటో పెట్టుకొని దిగులుగా కూర్చొని ఉన్న డ్రైవర్‌ రాజావలీ కనిపించారు. మాట కలపగా.. ‘ఏం చెప్పాలి సార్‌.. నాలుగు రోజులుగా ఆటో వేయలేదు. బయటకు రావడానికి కూడా వీలు లేని పరిస్థితి. ఇంటి చుట్టూ నీరు చేరింది. కారంచేడు నుంచి కుంకలమరు స్వర్ణ పర్పూరు గ్రామాలకు రాకపోకలు లేవు. దీంతో ఇల్లు గడవడం కూడా కష్టమైపోయిందని’’ పేర్కొన్నారు.

5న లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం

సామూహిక వ్రతం

బాపట్ల
మోంథా తుఫాన్‌ వేళ పాలకుల నిర్లక్ష్యంపై ప్రజల ఆవేదన

7

దాచేపల్లి: భట్రుపాలెంలోని లక్ష్మీనరసింహ స్వామి కల్యాణం, తిరునాళ్ల మహోత్సవం ఈ నెల 5వ తేదీన జరుగుతుందని దేవదాయశాఖ అధికారులు, కమిటీ సభ్యులు శనివారం తెలిపారు.

దుగ్గిరాల: దుగ్గిరాలలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం సామూహిక రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు.

కర్షకుల కష్టం వర్షార్పణం

ముంచెత్తిన మోంథా తుఫాన్‌

రోజులు గడిచినా ముంపులోనే పొలాలు

ఎకరాకు రూ. 50 వేల వరకు నష్టం

నివాస ప్రాంతాల్లోకి చేరిన వర్షపునీరు

కనీస సాయం అందక ఇబ్బందులు

పాలకుల తీరుపై బాధితుల ఆగ్రహం

కదిలిస్తే కన్నీరే..! 1
1/8

కదిలిస్తే కన్నీరే..!

కదిలిస్తే కన్నీరే..! 2
2/8

కదిలిస్తే కన్నీరే..!

కదిలిస్తే కన్నీరే..! 3
3/8

కదిలిస్తే కన్నీరే..!

కదిలిస్తే కన్నీరే..! 4
4/8

కదిలిస్తే కన్నీరే..!

కదిలిస్తే కన్నీరే..! 5
5/8

కదిలిస్తే కన్నీరే..!

కదిలిస్తే కన్నీరే..! 6
6/8

కదిలిస్తే కన్నీరే..!

కదిలిస్తే కన్నీరే..! 7
7/8

కదిలిస్తే కన్నీరే..!

కదిలిస్తే కన్నీరే..! 8
8/8

కదిలిస్తే కన్నీరే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement