కోదండరామునికి లక్ష తులసి దళార్చన
తెనాలిరూరల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెనాలి శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక శుక్రవారం రాత్రి ఇక్కడి బోస్‌రోడ్డులోని అసోసియేషన్ హాలులో నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులు డాక్టర్ జి.నరసింహారావు, డాక్టర్ ఎంవీ సత్యనారాయణ, డాక్టర్ జె.శివప్రసాద్ బాబు సమక్షంలో ఎన్నికలు నిర్వహించగా, 2025–26 కాలానికి అధ్యక్షుడిగా డాక్టర్ కొత్తమాసు శ్యాంప్రసాద్, సంయుక్త కార్యదర్శి గా డాక్టర్ టి.రాకేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా డాక్టర్ జి.రవిశంకరరావు, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ జి.కోటేశ్వరప్రసాద్, కోశాధికారిగా డాక్టర్ టి.అఖిలేష్ గెలుపొందారు.
పెదకాకాని: ఎట్టకేలకు మూడున్నర నెలల తర్వాత బీఈడీ ఫలితాలను వర్సిటీ అధికారులు వెల్లడించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మూడో సెమిస్టర్ ఫలితాలను, రెండో సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను అధికారులు శనివారం విడుదల చేశారు. శనివారం సాక్షి దినపత్రికలో విడుదలకు నోచుకోని బీఈడీ ఫలితాలు అనే కథనానికి స్పందన లభించింది. మూడు నెలల తర్వాత బీఈడీ ఫలితాలు విడుదలయ్యాయి. జూలై నెలలో దరఖాస్తు చేసుకున్న మూడో సెమిస్టర్ పునఃమూల్యాంకన ఫలితాలను విడుదల చేశారు. సెకండ్ సెమిస్టర్ ఫలితాలను కూడా శనివారం ప్రకటించారు. అక్టోబరు 30న బీఈడి మూడో సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువు ముగిసింది. దీంతో విద్యార్ధులు అధికంగా ఫీజులు చెల్లించారు. అధికంగా ఫీజులు చెల్లించడంపై యూనివర్సిటీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తేదీని పొడిగిస్తూ నిర్ణయం కూడా జరగలేదు. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అధిక ఫీజులు చెల్లించి ఆర్థికంగా నష్టపోయారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): వర్సిటీలోని జీవశాస్త్ర విభాగాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్‌లో 6 నెలల ఇంటర్న్‌షిప్‌కి ఎంపికయ్యారని వీిసీ ఆచార్య కె. గంగాధరరావు అన్నారు. శనివారం వారిని అభినందించారు. వీసీ మాట్లాడుతూ ఈ కాలంలో ప్రతి విద్యార్థికి నెలకు రూ.25 వేల చొప్పున ఉపకారవేతనం అందిస్తారన్నారు.
కోదండరామునికి లక్ష తులసి దళార్చన


