రాష్ట్రస్థాయి ఈతపోటీలకు కారంచేడు విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ఈతపోటీలకు కారంచేడు విద్యార్థులు

Nov 2 2025 9:36 AM | Updated on Nov 2 2025 9:36 AM

రాష్ట

రాష్ట్రస్థాయి ఈతపోటీలకు కారంచేడు విద్యార్థులు

చెరువు అభివృద్ధి పనులు పరిశీలన గుంటూరు రూరల్‌: మండలంలోని వెంగళాయపా లెం గ్రామంలోగల చెరువు అభివృద్ధి పనులను రాష్ట్ర పంచాయితీరాజ్‌ శాఖ గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ వీఆర్‌ కృష్ణతేజ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి కృషి సంబాయ్‌ యోజన కార్యక్రమంలో భాగంగా చెరువు అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. చెరువు కట్టలను బలోపేతం చేసి, వాకింగ్‌ ట్రాక్‌, సోలార్‌ లైట్స్‌ ఏర్పాటు, ఓపెన్‌ జిమ్‌, చిల్డ్రన్‌ పార్క్‌ వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పనులను పరిశీలించి జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు సంచాలకులు శివప్రసాద్‌, సంయుక్త సంచాలకులు సునీత, పనుల పర్యవేక్షణ అధికారి శాంతారామ్‌, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

కారంచేడు: పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సోమవారం నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్‌ పోటీలకు కారంచేడు యార్లగడ్డ నాయుడమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు ఎన్‌. సామ్రాజ్యం తెలిపారు. శనివారం ఉమ్మడి ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఏఎంబీ స్పోర్ట్స్‌ అకాడమీలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో వీరు ఎంపికై నట్లు ఆమె తెలిపారు. అండర్‌ 14 బాలుర విభాగంలో ఏడో తరగతి విద్యార్థులైన ఎబినేజర్‌, వెంకటేష్‌, ఆరో తరగతి విద్యార్థి వెంకటగోపి ఎంపికయ్యారు. అండర్‌– 17 బాలుర విభాగంలో 9వ తరగతి విద్యార్థులు శక్తి, సాంబశివరావు, 8వ తరగతి విద్యార్థులైన నాని ఎంపికై నట్లు ఆమె పేర్కొన్నారు. పాఠశాల పీడీ షేక్‌ మస్తాని.. అభినందనలు తెలిపారు.

రైలు ఢీకొని వ్యక్తి మృతి

చీరాల రూరల్‌: రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి స్టూవర్టుపురం–బాపట్ల రైల్వే స్టేషన్ల మధ్య దిగువ లైన్‌పై చోటు చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్సై సీహెచ్‌. కొండయ్య తెలిపారు. మృతుని వయస్సు 35 సంవత్సరాలు ఉంటాయని 5.6 అడుగుల ఎత్తు ఉంటాడని.. ఎరుపుఛాయ కలిగి ఉన్నాడని తెలిపారు. అలానే ఛాతీ మధ్యలో పుట్టుమచ్చ, పచ్చబొట్టు ఉందని, కుడిచేయిపై మామ్‌, డాడ్‌ అని ఇంగ్లిష్‌ పదాలు ఉన్నాయని, నేహా అనే పచ్చబొట్టు, కుడికాలికి నలుపు దారం కట్టి ఉందని చెప్పారు. మృతుని శరీరంపై తెలుపు లైట్‌క్రీమ్‌ కలర్‌ ఫుల్‌హాండ్స్‌ రెడీమేడ్‌ షర్ట్‌, బ్లూకలర్‌ లోయర్‌ ఉందని చెప్పారు. ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. పోస్టు మార్టం నిమిత్తం మృత దేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుని చిరునామా ఎవరికై నా తెలిసినట్లయితే 9440627646 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.

రాష్ట్రస్థాయి ఈతపోటీలకు కారంచేడు విద్యార్థులు 1
1/2

రాష్ట్రస్థాయి ఈతపోటీలకు కారంచేడు విద్యార్థులు

రాష్ట్రస్థాయి ఈతపోటీలకు కారంచేడు విద్యార్థులు 2
2/2

రాష్ట్రస్థాయి ఈతపోటీలకు కారంచేడు విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement