
పెరుగుతున్న సాగు నీటి విడుదల
వెల్లటూరు(భట్టిప్రోలు): కృష్ణానది ఎగువ నుంచి దిగువన బ్యాంక్ చానల్‌కు సాగు నీరు విడుదల పెంచుతున్నారు. వెల్లటూరు కాల్వ వద్ద నీరు పొంగి ప్రవహిస్తోంది. కాల్వ కట్టలు పొంగి పొర్లాయి. 5 తూములు కాల్వలు, వెల్లటూరు ఇరువైపులా ఉన్న వంతెన కింద ప్రవాహం తాకింది. సాగు నీటి పారుదల శాఖ కార్యాలయం, లోకల్ ఫండ్ సత్రం ప్రధాన రహదారిలో నీరు చేరుతోంది. సాగునీరు పశ్చిమ బ్యాంక్ కెనాల్ వద్దకు సమీపంలోని ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎగువ చానల్ నుంచి నీరు విడుదల నిలుపుదల చేయడానికి చర్యలు చేపట్టినట్లు నీటి పారుదల శాఖాధికారులు తెలిపారు.