రైతులపై అదే చిన్నచూపు | - | Sakshi
Sakshi News home page

రైతులపై అదే చిన్నచూపు

Jul 20 2025 6:07 AM | Updated on Jul 20 2025 3:11 PM

రైతుల

రైతులపై అదే చిన్నచూపు

నాయకులదే హవా..

గతంలో కియోస్క్‌ యంత్రాల ద్వారా అందించిన సేవలు ప్రస్తుతం ఫోన్‌ల ద్వారా అందజేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రేపల్లె వ్యవసాయ సబ్‌ డివిజన్‌లో సేవల కోసం సేవా కేంద్రాలకు వెళ్లిన రైతులకు గ్రామ నాయకుడితో ఫోన్‌ చేయిస్తే ఆర్డర్‌ బుక్‌ చేస్తామంటూ బహిరంగంగానే అంటున్నట్లు చెబుతున్నారు.

రేపల్లె: గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన రైతు సంక్షేమ పథకాలను కూటమి సర్కార్‌ హయాంలో ఒక్కొక్కటిగా నిలిపేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ సేవలకు కేంద్రబిందువులుగా నిలిచిన రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు కేవలం పేరుకే ‘రైతు సేవా కేంద్రాలు’గా మిగిలిపోయాయి. కియోస్క్‌లను మూసివేయడం వల్ల పంటల నమోదు, పాస్‌బుక్‌ ప్రింటింగ్‌, రైతుబంధు/రుణ మాఫీ వివరాలు, పెట్టుబడి సాయానికి సంబంధించిన సమాచారాన్ని సకాలంలో పొందలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మూలకు చేరిన 390 యంత్రాలు

బాపట్ల జిల్లాలో మొత్తంగా 390 కియోస్క్‌ యంత్రాలు పనిచేయడం లేదు. రైతులు ఆన్‌లైన్‌ సేవల కోసం మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. రైతులకు నేరుగా సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు, ఇప్పుడు ‘రైతు సేవా కేంద్రాల’గా మారిపోయాయి. ఈ మార్పుతోపాటు రైతులకు సాంకేతిక సేవలు అందించే కియోస్క్‌ యంత్రాలు పెద్దఎత్తున మూలకు చేరాయి. దీనివల్ల రైతులు దరఖాస్తులు, పంటల నమోదు, ఆన్‌లైన్‌ సర్టిఫికెట్లు వంటి సేవల కోసం మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మళ్లీ నిరూపించుకున్న కూటమి సర్కార్‌ జిల్లాలో 390 కియోస్క్‌లకు తాళాలు అనుకూల వర్గీయులకే ఫోన్‌ ద్వారా సేవలు అందిస్తున్న సిబ్బంది

ఫోను ద్వారా సేవలు

రేపల్లె వ్యవసాయ సబ్‌ డివిజన్‌లోని రైతు సేవా కేంద్రాలలో రైతులకు అవసరమైన సేవలను అందిస్తున్నాం. గతంలో కియోస్క్‌ యంత్రాల ద్వారా అందిన సేవలు ప్రస్తుతం గ్రామ సహాయకుల చేత ఫోన్‌ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఇలా సేవలు పొందటం వల్ల కియోస్క్‌ యంత్రాలతో పనిలేకుండా పోతోంది.

– అదేపల్లి లక్ష్మి, ఏడీఏ, రేపల్లె

రైతులపై అదే చిన్నచూపు 1
1/1

రైతులపై అదే చిన్నచూపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement