
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులు(పార్లమెంట్)గా జిల్లాకు చెందిన బసవ పున్నారెడ్డి, చేజర్ల నారాయణరెడ్డి, కర్నేటి వెంకటప్రసాద్‌లను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, జిల్లా పరిశీలకులకు వీరు సహాయకులుగా పనిచేయనున్నారు.
తొలి నుంచి పార్టీకి అండగా..
● మోదుగుల బసవపున్నారెడ్డి వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. పిట్టలవానిపాలెం మండల పరిషత్ అధ్యక్షుడిగా పని చేశారు. పార్టీ రేపల్లె, వేమూరు, ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గాల పరిశీలకుడిగా వ్యవహరించారు. బసవ పున్నారెడ్డిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంతో ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేశారు.
● జిల్లాకు చెందిన చేజర్ల నారాయణరెడ్డి వైఎస్సార్‌సీపీలో క్రియాశీలక నేతగా ఉన్నారు. రెండు మార్లు చేనేత, జౌళి శాఖ సలహామండలి సభ్యుడిగా పనిచేశారు. వైఎస్సార్‌సీపీ బాపట్ల జిల్లా అగ్రిగోల్డ్ బాధితుల బాసట సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు.
● చీరాలకు చెందిన కర్నేటి వెంకట ప్రసాద్ విద్యార్థి దశ నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశారు. బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. తమకు పార్టీ పదవులు ఇచ్చిన పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిశీలకులు వైవీ సుబ్బారెడ్డి, బాపట్ల పార్లమెంట్ పరిశీలకులు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి, చీరాల సమన్వయకర్త కరణం వెంకటేశ్‌లకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి తమ వంతుగా నాయకులు, కార్యకర్తలను కలుపుకొని కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు వెల్లడించారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం