
మైక్రో ఆర్టిస్ట్ మహితకు కలెక్టర్ మురళి ఆర్థిక ప్రోత్స
బాపట్ల : చీరాలకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ అన్నం మహిత జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళిని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కలిశారు. తన అద్భుతమైన కళా ప్రతిభతో మహిత 93 ఫెన్సిల్స్‌పై నెల్సన్ మండేలా జీవిత చరిత్రను, మరో 810 ఫెన్సిల్స్‌పై మహాభారతంలోని 700 శ్లోకాలను అత్యంత సూక్ష్మంగా చెక్కి అందరి ప్రశంసలు అందుకున్నారు. మహిత అసాధారణ ప్రతిభను కలెక్టర్ మురళి అభినందించారు. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, తన వంతు సహాయంగా రూ.15వేలు చెక్కు రూపంలో మహితకు అందజేశారు. కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య యాదవ్ పాల్గొన్నారు. కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా కలెక్టర్ తీసుకున్న ఈ చొరవను పలువురు అభినందిస్తున్నారు.
దూరవిద్యను సద్వినియోగం చేసుకోవాలి
రేపల్లె: చదువు మధ్యలో ఆపేసిన వారు ఓపెన్ స్కూల్‌ను వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ బి.శ్రీనివాసరావు చెప్పారు. 2025–26 విద్యా సంవత్సరంలో దూర విద్య ద్వారా పదో తరగతి చదువు మానేసిన విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా స్టడీ సెంటర్‌ల నిర్వాహకులు పనిచేయాలని కోరుతూ పట్టణంలోని ఓ స్టడీ సెంటరులో శుక్రవారం వాల్‌పోస్టర్‌లను విడుదల చేసి మాట్లాడారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఈ ఓపెన్ పదో తరగతి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో కేసనశెట్టి సురేష్, ఎంఈవో రత్నశ్రీధర్, వివిధ స్టడీ సెంటర్‌ల నిర్వాహకులు పాల్గొన్నారు.
కాలువలో గుర్తు తెలియని మృతదేహం
అమర్తలూరు(వేమూరు): అమర్తలూరు మండలం తురిమెళ్ల తూర్పు కాలువలో శవం కనిపించడంతో గ్రామస్తులు శుక్రవారం గ్రామ వీఆర్వోకు దృష్టికి తీసుకెళ్లారు. వీఆర్వో పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవితేజ తెలిపారు.

మైక్రో ఆర్టిస్ట్ మహితకు కలెక్టర్ మురళి ఆర్థిక ప్రోత్స