ఆశ పడ్డారు...భంగ పడ్డారు | - | Sakshi
Sakshi News home page

ఆశ పడ్డారు...భంగ పడ్డారు

Jul 17 2025 3:34 AM | Updated on Jul 17 2025 3:34 AM

ఆశ పడ

ఆశ పడ్డారు...భంగ పడ్డారు

సారక్షి ప్రతినిధి, బాపట్ల: వంచనకు, వెన్నుపోటుకు మారు పేరు తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం విమర్శకులు, రాజకీయ విశ్లేషకులు చాలామంది అదే పేరుతో సంబోధించడం తెలిసిందే! అలాంటి పార్టీ ని, అధినేతను నమ్మి చేరితే వెన్నుపోట్లు, భంగపాట్లు తప్ప ఏం జరుగుతుంది? ఇప్పుడు చీరాల మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో అక్షరాలా ఇదే జరిగింది. ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య తన సామాజికవర్గానికే చెందిన 11వ వార్డు కౌన్సిలర్‌ మించాల సాంబశివరావుకే చీరాల మున్సిపల్‌ చైర్మన్‌ పదవి కట్టబెట్టారు. పదవిని ఆశించిన వివిధ సామాజికవర్గాల సీనియర్‌ నేతలకు భంగపాటు తప్పలేదు. దీంతో ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు అధికారం, పదవులను ఆశించి కన్నతల్లిలాంటి వైఎస్సార్‌ సీపీకి వెన్నుపోటు పొడిచిన సీనియర్‌ కౌన్సిలర్లు చంద్రబాబు పార్టీలో అదే వెన్నుపోటుకు గురికావడం జిల్లాలో చర్చనీయాంశమైంది.

మించాలను వరించిన చైర్మన్‌ పదవి

బుధవారం జరిగిన చీరాల మున్సిపల్‌ ఎన్నికల్లో 19వ వార్డు కౌన్సిలర్‌ మించాల సాంబశివరావును చైర్మన్‌ గా ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన మించాలను పార్టీ అధిష్టానమే షీల్డ్‌ కవర్‌ పద్ధతిలో ఎంపిక చేసినట్లు పచ్చపార్టీ నేతలు కలరింగ్‌ ఇచ్చినా కవర్‌ తెచ్చినట్లు చెబుతున్నా కవర్‌ తెచ్చిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి పార్థసారథి సైతం అదే సామాజికవర్గానికి చెందిన వారు కావడం చీరాలలో మరింత చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఎమ్మెల్యే కొండయ్య తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే మున్సిపల్‌ చైర్మన్‌గా ఎంపిక చేయడం పట్ల నియోజకవర్గంలోని మిగిలిన బలమైన సామాజిక వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. బలమైన పద్మశాలి సామాజికవర్గానికి చెందిన మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావుతోపాటు ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన 18వ వార్డు కౌన్సిలర్‌ పొత్తూరి సుబ్బయ్య, కాపు సామాజికవర్గానికి చెందిన 9వ వార్డు కౌన్సిలర్‌ రాములు సైతం మున్సిపల్‌ చైర్మన్‌ పదవి కోసం పోటీపడ్డారు.

ఫిరాయింపుదారులకు పచ్చపోటు

చీరాల మున్సిపాలిటీలో 33 కౌన్సిల్‌ స్థానాలు ఉండగా వైఎస్సార్‌ సీపీ తరపున 22 మంది, మాజీ మ్మెల్యే ఆమంచి మద్దతుదారులు 11 మంది కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. టీడీపీ అధికారంలోకి రావడంతో 26 మంది అనైతికంగా వెన్నుపోటుతో పచ్చపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు అదే నేతలకు చంద్రబాబు వెన్నుపోటు కలిసొచ్చింది. పార్టీలో చేర్పించుకొని పచ్చ పార్టీ కసితీరా వెన్నుపోట్లు పొడిచింది. వైఎస్సార్‌ సీపీని వీడివెళ్లిన వారికి ఇలాగే జరగాలని చీరాల వాసులు భావిస్తున్నారు.

ఎమ్మెల్యే సామాజిక వర్గానికే చైర్మన్‌ గిరి

చీరాల మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలో ఎమ్మెల్యే మార్క్‌ పదవి ఆశించి భంగపడ్డ నేతలు ఆస్తులు అమ్ముకొని నష్టపోయానంటూ కౌన్సిలర్‌ సుబ్బయ్య ఆవేదన ఆవేదనతో పచ్చపార్టీకి రాజీనామా వైఎస్సార్‌ సీపీని వీడి భంగపడ్డ మాజీ చైర్మన్‌ జంజనం కౌన్పిలర్‌ రాములుకు మొండిచెయ్యి వైఎస్సార్‌ సీపీ నుంచి వచ్చిన నేతలకు వెన్నుపోటు ఎమ్మెల్యే కొండయ్య తీరుపై మెజార్టీ సామాజికవర్గాల ఆగ్రహం

అనైతిక వెన్నుపోట్లు

మూడుసార్లు కౌన్సిలర్‌గా గెలిచి చైర్మన్‌ పదవి దక్కకపోవడంతో 18వ వార్డు కౌన్సిలర్‌ పొత్తూరు సుబ్బయ్య పత్రికలు, మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంత మయ్యారు. తనను పచ్చపార్టీ చంపేసిందన్నారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకొని నష్టపోయానని తీవ్ర ఆవేదన చెందారు. టీడీపీకి, కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేస్తున్నానన్నారు. పాపం పొత్తూరు సుబ్బయ్య ఆవేదన చీరాల వాసులను కదిలించలేక పోయింది. పదవుల కోసం తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన వైఎస్సార్‌ సీపీకి వెన్నుపోటు పొడిచి ఆయన పచ్చపార్టీ కండువా కప్పుకోవడాన్ని చీరాల వాసులు ఇంకా మరిచి పోలేదు. అందుకే ఆయన కన్నీళ్ల పట్ల ఇక్కడి ప్రజలలో సానుభూతి కనిపించలేదు. మొత్తంగా చీరాల కొత్త మున్సిపల్‌ ఎన్నిక ఎమ్మెల్యే ఎంఎం.కొండయ్యపై మెజార్టీ సామాజికవర్గాల్లో వ్యతిరేకత పెంచగా పచ్చపార్టీ వెన్నుపోట్ల వ్యవహారం మరోమారు చర్చనీయాంశంగా మారింది.

నేడు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక

చీరాల: చీరాల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎన్నిక బుధవారం జరుగుతుందని ఊహించినా చివరి నిమిషంలో వాయిదా పడింది. గురువారం ఉదయం 11గంటలకు మున్సిపల్‌ కౌన్సిల్‌ హాలులో ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారి టి.చంద్రశేఖర్‌నాయుడు తెలిపారు.

చీరాల మున్పిపల్‌ చైర్మన్‌ విషయంలో టీడీపీ అవిశ్వాసం నోటీసు ఇవ్వగానే వైఎస్సార్‌ సీపీ తరపున గెలిచి చీరాల మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్న జంజనం శ్రీనివాసరావు అప్రమత్తమై పదవితోపాటు రియల్‌ ఎస్టేట్‌ అక్రమ వ్యాపారాలను నిలబెట్టుకోవాలనే తాపత్రయంతో పచ్చపార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్సార్‌ సీపీ నుంచి కౌన్సిలర్‌గా గెలిచిన పొత్తూరు సుబ్బయ్య మున్సిపల్‌ చైర్మన్‌ కావాలనే తాపత్రయంతో సొంత పార్టీ వైఎస్సార్‌ సీపీకి వెన్నుపోటు పొడిచి ఏకంగా చంద్రబాబు సమక్షంలో పచ్చపార్టీలో చేరారు. ఇక తాజాగా చైర్మన్‌గా ఎన్నికై న సాంబశివరావు సైతం వైఎస్సార్‌ సీపీ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికై ఎమ్మెల్యే సమక్షంలో పచ్చపార్టీ కండువా కప్పుకున్నారు. మరో కౌన్సిలర్‌ రరాములు వైఎస్సార్‌ సీపీ తరపున ఎన్నికై మున్సిపల్‌ చైర్మన్‌ గిరీ ఆశించి టీడీపీలో చేరారు. వీరందరూ చంద్రబాబు వెన్నుపోటును ఆదర్శంగా తీసుకొని వెన్నుపోట్లకు దిగిన వారే కావడం గమనార్హం.

ఆశ పడ్డారు...భంగ పడ్డారు 1
1/1

ఆశ పడ్డారు...భంగ పడ్డారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement