
మెరుగైన వైద్య సేవలందించాలి
పిట్టలవానిపాలెం(కర్లపాలెం): సామాజిక ఆరో గ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా ప్రభుత్వ వైద్యశాలల సమన్వయ అధికారి డాక్టర్ ఎన్.మోజెస్‌కుమా ర్ వైద్యులకు సూచించారు. పిట్టలవానిపాలెంలోని వైద్య పరిషత్ సామాజిక ఆరోగ్య కేంద్రా న్ని బుధవారం జిల్లా ప్రభుత్వ వైద్యశాలల సమన్వయ అధికారి డాక్టర్ ఎన్.మోజెస్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సిబ్బంది అందరూ నిర్దేశిత సమయానికే వైద్యశాలకు చేరుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలతోపాటు ముఖ్యంగా టాయిలెట్‌లను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని రకాల వ్యాధుల కు అవసరమైన రక్త పరీక్షలు నిర్వహించి సకాలంలో రిపోర్టులు వచ్చేలా వైద్యులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది ఉన్నారు.
558.70 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయంం నీటిమట్టం బుధవారం 558.70 అడుగులకు చేరింది. ఇది 229.3671 టీఎంసీలకు సమానం.సాగర్ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 1,650 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 65,900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
వైద్యులు సమయపాలన పాటించాలి జిల్లా వైద్యశాలల సమన్వయ అధికారి మోజెస్‌కుమార్