
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీ విభాగంలో నియామకం
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన ఇరువురిని పార్టీ రాష్ట్ర ఎస్టీ విభాగం కమిటీలో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎస్టీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా సత్తెనపల్లికి చెందిన చిలకల జయపాల్, పెదకూరపాడుకు చెందిన చిలకల పెదబాబును నియమించారు.
20న బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ ఉదయం 8 గంటలకు స్థానిక ఎన్జీఓ క్లబ్‌లో ఉమ్మడి గుంటూరు జిల్లా సబ్ జూనియర్స్, సీనియర్స్ పురుషుల, మహిళల జిల్లా జట్ల ఎంపిక నిర్వహిస్తామని అసోసియేషన్ అధ్యక్షులు ఇ.శివశంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ జూనియర్స్ విభాగంలో పాల్గొనే చిన్నారులు జనవరి 2, 2010 తర్వాత జన్మించిన వారై ఉండాలన్నారు. పోటీలకు హాజరయ్యే వారు వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాకలకు 83477 85888 నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
లక్ష్యానికి మించి ఉపాధి పనులు
యడ్లపాడు: జిల్లాలో ఉపాధి హామీ పనులు లక్ష్యానికి మించి జరుగుతున్నాయని జిల్లా డీఆర్‌డీఏ పీడీ ఎంఎస్ మూర్తి వెల్లడించారు. మంగళవారం యడ్లపాడు ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, ఉపాధి హామీ పథకం పనులు ప్రగతి, లక్ష్యాలు, ఇతర విషయాలను అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో ఈ ఏడాది ఉపాధి పనుల లక్ష్యం 45 లక్షల పనిదినాలు కాగా, ఇప్పటికే 55.13 లక్షల పని దినాలు పూర్తయ్యాయని, ఇది లక్ష్యానికి మించి సాధించిన ప్రగతి అని వివరించారు. గోకుల షెడ్ల పథకానికి సంబంధించి గత ఏడాది మంజూరైన 740 గోకుల షెడ్లలో 63 షెడ్లు బేస్ లెవల్‌లో ఉన్నాయని, మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఉద్యాన పంటలకు ఉపాధి హామీ పథకం కింద 100శాతం రాయితీని అందిస్తున్నామని ఎంఎస్ మూర్తి తెలిపారు.
డీఆర్‌డీఏ పీడీ ఎంఎస్ మూర్తి