
మాజీ గవర్నర్ కోన ప్రభాకరరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాల
బాపట్ల: బాపట్ల ప్రాంత అభివృద్ధిలో కీలకపాత్ర వహించటంతోపాటు మాజీ గవర్నర్ కోన ప్రభాకరరావు విగ్రహాన్ని బాపట్లలో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని వైఎస్సార్ సీపీ నాయకులు డీఆర్వో గంగాధర్‌గౌడ్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారవేదికలో ప్రజల నుంచి సేకరించిన సంతకాల పేపర్లును డీఆర్‌ఓకు అందించారు. వైఎస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షులు మురుప్రోలు ఏడుకొండలరెడ్డి మాట్లాడుతూ బాపట్ల ప్రాంతానికి కృష్ణాజలాలను తెప్పించటంలో కీలకమైన పాత్ర పోషించిన కోన ప్రభాకరరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కొంతమంది అడ్డుకోవటం సరైన పద్ధతి కాదన్నారు. పాతబస్టాండ్‌లో పునఃస్థాపించేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చల్లా రామయ్య, నాయకులు మచ్చా శ్రీనివాసరెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
డీఆర్వోకు వినతి