
కడతారా.. చస్తారా !
జే.పంగులూరు: ప్రైవేటు కంపెనీల వలలో పడి పేదల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. మండలంలోని 21 గ్రామాల్లోని దళిత కాలనీలే టార్గెట్‌గా, వారి అవసరాలను ఆసరాగా చేసుకొని ప్రైవేటు కంపెనీలు చెలరేగుతున్నాయి. ప్రైవేటు కంపెనీలలో రుణాలు ఇచ్చి వారి ఇళ్లను తాకట్టు పెడుతున్నారు. కట్టకుంటే జప్తు పేరుతో ఇళ్లకు సీల్ వేస్తున్నారు.
ఇంటిపై స్వాధీనత ముద్ర
బైటమంజులూరు గ్రామానికి చెందిన ఇంటూరి అనూక్ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో అప్పు తీసుకున్నాడు. మూడు నెలల నుంచి కిస్తీ చెలించకపోవడంతో ఆ ఇంటి గోడపై ఈ ఇల్లు మా ఆధీనంలో ఉంది. దీనిపై హక్కులన్ని మావే, ఇల్లు కొనదలుచుకున్నవారు మమ్మల్ని సంప్రదించాలి అంటూ గోడపై ముద్ర వేశారు. ఇటీవల కాలంలో దళిత కాలనీకి చెందిన ఇద్దరు యువకులు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ అప్పు చెలించలేక ఆత్మహత్యయత్నం చేయగా స్థానికులు గుర్తించి వారిని రక్షించినట్లు తెలిపారు.
ప్రభుత్వ అనుమతులు లేకుండా..
బైటమంజులూరు గ్రామంలో పేదల జీవితాను ఫైనాన్స్ సంస్థలు అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 26 ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు తిరుగుతూ పేదలను ఆకర్షిస్తూ అప్పులిచ్చి, అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాయి. ఆ వడ్డీలు చెలించలేక పేదలు నానా యాతనలు పడుతున్నారు. కూలీ పనుల మీద ఆధారపడి జీవించే పేదలు నెలనెలా రూ.10వేలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలతో పేదల బతుకులు చిత్తు పేదలే టార్గెట్‌గా అప్పులు ఇస్తామని తిరుగుతున్న 26 ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు అధిక వడ్డీలు వసూలు చేస్తూ, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వైనం కిస్తీలు కట్టకుంటే ఇంటిపై స్వాధీనత బోర్డులు గతంలో ఆడవాళ్లను బయటికి లాగి ఇళ్లకు సీల్ వేసిన దుస్థితి కుటుంబ యజమాని చనిపోయినా బాకీ చెలించాల్సిందేనని పట్టు ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన ఇద్దరు దళిత యువకులు