
భర్త మరణించినా..
బైటమంజులూరు గ్రామ గిరిజన కాలనీకి చెందిన పాలపర్తి వెంకటేశ్వర్లు ఫైవ్ స్టార్ ప్రైవేట్ ఫెనాన్స్ కంపెనీ వద్ద ఇల్లు తాకట్టు పెట్టి రూ. 3 లక్షల రుణం తీసుకున్నాడు. చేతికి రూ. 2.75 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఇందుకుగాను నెలకు రూ. 7356 కిస్తీ చెల్లిస్తున్నాడు. మొత్తం 84 నెలలు కిస్తీ చెల్లించాల్సి ఉండగా, 36 నెలలు చెల్లించాడు. అయితే అతను మే నెల 29వ తేదీన గుండెపోటుతో మరణించాడు. కుటుంబ పోషణకు దికై ్కన వెంకటేశ్వర్లు మరణించడంతో ఆ కుటుంబం ఆధారం కోల్పోయింది. భర్తపోయిన దుఖఃలో సీతమ్మ ఉండగా.. సదరు ప్రైవేటు ఫైనాన్స్‌వారు మీ భర్త చనిపోతే మాకేంటి..? మాకు కట్టాల్సిన కిస్తీలు కట్టాల్సిందేనని, లేకుంటే ఇల్లు వేలం వేస్తామంటు బెదిరింపులకు దిగారు.