
రెడ్‌బుక్ రాజ్యాంగంపై ఆత్మస్థైర్యంతో పోరాటం
కొల్లూరు: అబద్ధ్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలుచేయకుండా ప్రజలను నట్టేట ముంచుతుందని వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు మండిపడ్డారు. కొల్లూరు గాంధీనగర్ వద్ద పార్టీ మండల కన్వీనర్ సుగ్గున మల్లేశ్వరరావు అధ్యక్షతన గురువారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అశోక్‌బాబు మాట్లాడుతూ కూటమి నేతలు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ గ్రామాలలో విష సంస్కృతిని అలవాటు చేయడం దురదృష్టకరమని ఖండించారు. రెడ్‌బుక్ రాజ్యాంగానికి కార్యకర్తలు భయపడకుండా కలసికట్టుగా ఉంటూ ఆత్మస్థైర్యంతో ప్రజాసమస్యలపై పోరాటం చేయా లని ఆయన పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను అణచివేసేందుకు పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని, తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తే వారి పైనా ప్రైవేటు కేసులు పెట్టేందుకు సిద్ధమని హెచ్చరించారు. చంద్రబాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మోసాలను నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని అన్నారు. క్యూఆర్ కోడ్‌ను వినియోగించే విధానంపై నాయకులు, కార్యకర్తలకు ఆయన వివరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు చొప్పర సుబ్బారావు, ఎంపీటీసీ సభ్యులు బుల్లా నవరత్నం, బావిరెడ్డి వెంకట్రామయ్య, గుంటూరు రామారావు, కోఆప్షన్ సభ్యుడు షేక్ బాజి, సర్పంచ్‌లు మంచాల వసుంధర, గుర్రం మురళి మేకతోటి శ్రీకాంత్, మాజీ ఎంపీపీ పెరికల పద్మారావు, మాజీ సర్పంచి కట్టుపల్లి సోమయ్య, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండలస్థాయి వివిద విభాగాల నాయకులు కోగంటి లవకుమార్, బిట్రగుంట సత్యనారాయణ, పెరికల పద్మారావు, జోషిబాబు, సుధారాణి, గుర్రం వీరరాఘవయ్య, సిరాజుద్దీన్, చలంచర్ల కనకదుర్గ, దివి వెంకటేశ్వరరావు, హుసేన్, నాంచారయ్య, సురేష్, కనపర్తి మోహన్‌రావు, గుంటూరు పవన్‌కుమార్, శివన్నారాయణ, గరిక రమేష్, రామ్మోహన్ పాల్గొన్నారు.
వేమూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు
కొల్లూరులో విస్తృతస్థాయి సమావేశం