
బాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డి
పర్చూరు(చినగంజాం): అమలుకు నోచుకోని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు మోసాలను ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డి తెలిపారు. స్థానిక అద్దంకి నాంచారమ్మ ఫంక్షన్ హాలులో బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ సమాయత్త సభ పార్టీ మండల అధ్యక్షుడు కఠారి అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు. గాదె మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, కరోనా కష్టకాలంలో ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పటికీ రాష్ట్రంలో చక్కటి పాలన అందించారని, సంక్షేమ పథకాలను అవాంతరం లేకుండా చేశాన్నారు. చంద్ర బాబు సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా నెరవేర్చలేకపోయారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా తమ నాయకుడు జగన్‌మోహనరెడ్డిని దూషించటమే ధ్యేయంగా పెట్టుకన్నారని ..ఇటువంటి నాయకుడు మనకు అవసరమా ? అని దుయ్యబట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి కోడ్‌ను ఆయా కుటుంబాలకు చెందిన సెల్‌ఫోన్‌లలో స్కాన్ చేయించి అందులో వచ్చే చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో, ఇతర వాగ్దానాలు, హామీలు, సూపర్ సిక్స్ పథకాలు గురించి ప్రజలకు వివరించాలని మధుసూదనరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, వైస్ ఎంపీపీ పాలేరు వీరయ్య, జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు తోకల కృష్ణమోహన్, బూత్ కమిటీ అధ్యక్షుడు ముప్పాళ్ళ రాఘవయ్య, కోట శ్రీనివాసరావు,తులసీ నాగమణి, గోరంట్ల శివకుమారి, యూత్ అధ్యక్షుడు కొల్లా శేషగిరి, మల్లా శ్రీను, ప్రచార కమిటీ అధ్యక్షుడు దాసరి వెంకటరావు, మల్లిశెట్టి జగన్నాథం, యద్దనపూడి హరిప్రసాద్, కంచనపల్లి రమేష్, గాదె సురేష్, ఇంకొల్లు మండల కన్వీనర్ చిన్ని పూర్ణారావు పాల్గొన్నారు.