
రైలు కింద పడి యువకుడు మృతి
రేపల్లె: రైలు కింద పడి యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. జీఆర్‌పీ ఎస్‌ఐ వెంకటాద్రి వివరాల మేరకు సికింద్రాబాద్ నుంచి రేపల్లెకి రాత్రి 9 గంటలకు వచ్చే డెల్టా ఎక్స్‌ప్రెస్ కింద యువకుడు పడి మృతి చెంది ఉండటాన్ని రైల్వే గ్యాంగ్‌మెన్‌లు గమనించి మంగళవారం సమాచారం ఇచ్చారన్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా మృతుడు నగరం మండలం ధూళిపూడి గ్రామానికి చెందిన కొండవీటి మణి (25)గా గుర్తించామన్నారు. మోర్లవారిపాలెం రైల్వే గేటుకు సమీపంలో ప్రమాదం జరిగిందన్నారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించామన్నారు.