
వాడవాడలా దివంగత నేత వైఎస్సార్ జయంతి వేడుకలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ జయంతిని పురష్కరించుకొని వైఎస్సార్ సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొన్నిచోట్ల క్షీరాభిషేకాలు చేశారు. కేక్‌లు కట్‌చేసి స్వీట్లు పంచి పెట్టారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అనాథలకు దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేయడంతోపాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆస్పత్రులలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. వైఎస్.రాజశేఖరరెడ్డి జనరంజక పాలనను జనం గుర్తుకు తెచ్చుకున్నారు. ఆయనను దేవుడిలా కొలిచిన పేద, మధ్యతరగతి ప్రజలు మరోమారు స్మరించుకున్నారు.
● వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం అద్దేపల్లిలో సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు ఆధ్వర్యంలో దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు ర్తకదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకటరమణ, పార్టీ మండల అధ్యక్షుడు పడమటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వేమూరు, కొల్లూరు, చుండూరు, అమర్తలూరు మండలాలలో వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు.
● రేపల్లెలో నియోజకవర్గ సమన్వయకర్త ఈవూరు గణేష్ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత రేపల్లె పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. బస్టాండ్ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తరువాత గుళ్లపల్లి వరకూ ర్యాలీ నిర్వహించి అనంతరం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవూరు గణేష్‌తోపాటు పార్టీ నేతలు చిత్రాల ఒబెదు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నగరం, నిజాంపట్నం మండలాల్లో కూడా వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు.
● అద్దంకిలో సమన్వయకర్త పానెం చిన హనిమిరెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత పార్టీ కార్యాలయంలో కేక్‌కట్ చేశారు. తరువాత ఎన్‌టీఆర్ నగర్‌లోని వైఎస్సార్ విగ్రమానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, జ్యోతి హనుమంతరావు, రాధాకృష్ణమూర్తి పాల్గొన్నారు.
● పర్చూరులో నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో దివంగత నేత వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఇంకొల్లు స్థూపం సెంటర్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. ఆ తర్వాత చినగంజాంలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృద్ధాశ్రమంలో దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం చేశారు. అనంతరం కారంచేడులో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. కేట్‌కట్ చేశారు. తరువాత పర్చూరు, యద్దనపూడి, మార్టూరు మండలాలలోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
● చీరాలలో సమన్వయకర్త కరణం వెంకటేశ్ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత గడియారస్తంభం సెంటర్‌లో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేకంగా మహిళలతో కేక్ కట్ చేయించారు. అనంతరం ఆస్పతిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మేరీబాబు, అంకాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు పలుచోట్ల అన్నదానం, రక్తదాన శిబిరాలు రోగులకు పండ్లు పంపిణీ, అనాథలకు దుప్పట్ల పంపిణీ ఆయా నియోజకవర్గాలలో పాల్గొన్న సమన్వయకర్తలు

వాడవాడలా దివంగత నేత వైఎస్సార్ జయంతి వేడుకలు