
నరేంద్ర.. నోరు అదుపులో పెట్టుకో!
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): ధూళిపాళ్ల నరేంద్ర.. నోరు అదుపులో పెట్టుకో.. మన్నవ గ్రామంలో బొనిగల నాగమల్లేశ్వరరావుపై దారుణంగా దాడి చేసి.. గూండాలు, రౌడీషీటర్‌లని వ్యాఖ్యానించటం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు హెచ్చరించారు. 60 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ఒక దళిత కుటుంబంపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గుంటూరు నగరం బృందావన్‌గార్డెన్స్‌లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం తాను, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ కలిసి ఆస్పత్రిలో ఉన్న నాగమల్లేశ్వరరావును చూసి రావటం జరిగిందన్నారు. దళిత కుటుంబానికి చెందిన నాగమల్లేశ్వరరావుపై టీ స్టాల్ వద్ద టీడీపీ నేతలు దాడి చేయడం ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఆ కుటుంబానికి చెందిన అమరేంద్రపై కూడా దాడి చేశారని, ఆ కుటుంబాన్ని మట్టుబట్టేందుకు ధూళిపాళ్ల, ఇతర టీడీపీ నేతలు సిద్ధమయ్యారన్నారు. గీత దాటిస్తే భూస్థాపితం చేయండని చెప్పటం.. చంపండి అని చెప్పడం ఒకటేనని దుయ్యబట్టారు. కచ్చితంగా ధూళిపాళ్ల శిక్షార్హులని, ఆయనపై 307 ఐపీసీ కేసు నమోదు చేయాలని, ఏ1గా పెట్టాలని డిమాండ్ చేశారు.
ధూళిపాళ్ల ఆదేశాలతోనే దాడి
– అంబటి మురళీ కృష్ణ
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఆదేశాలతోనే నాగేమల్లేశ్వరరావుపై దాడికి తెగబడ్డారని అంబటి మురళీకృష్ణ నిప్పులు చెరిగారు. ఆసుపత్రిలో ఉన్న నాగమల్లేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉందన్నారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్యంపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాకబు చేశారని తెలిపారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పొంతన లేని మాటాలు మాట్లాడుతున్నారన్నారు. నాగమల్లేశ్వరరావు సోదరుడిపై కూడా దాడి చేసినప్పుడు ఆయన ఫిర్యాదు చేస్తే.. తిరిగి అతనిపైనే కేసు నమోదు చేశారన్నారు. కూటమి నేతలకు పోలీసులు, దాసోహమై వ్యవహరిస్తున్నారన్నారు. పొన్నూరు రూరల్ ఎస్‌ఐ కిరణ్ ఏకపక్షంగా టీడీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని.. అన్ని రోజులు ఒకేలా ఉండవన్న విషయాన్ని గుర్తించాలని హెచ్చరించారు. చేబ్రోలు ఎస్‌ఐ వెంకటకృష్ణచౌదరి వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను స్టేషన్‌కు పిలిపించి, గోడ కుర్చీలు వేయించి, ఒక మేడమ్‌కు వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు నాగమల్లేశ్వరరావు సోదరుడు, ప్రస్తుత ఎంపీటీసీ బొనిగల అమరేంద్రప్రసాద్, పార్టీ నేతలు చింతలపూడి మురళీకృష్ణ, షేక్ నాజర్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,
వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి