
శింగరకొండ విచ్చేసిన పీఠాధిపతులు
అద్దంకి రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ దేవస్థానానికి గురువారం అయోధ్య జానకి ఘాట్ జయ శరణ్ జీ మహరాజ్, అయోధ్య విశ్వకుటుంబ ఆకార పీఠం ట్రస్ట్ చీఫ్ సూర్యప్రకాష్ సరస్వతి రుద్రదిండి, చినమస్తాన్‌దేవి పీఠాధిపతులు, మహా మండేశ్వరీ పద్మావతి, నారాయణ ప్రత్యంగి మహాదేవి విచ్చేశారు. దేవస్థాన అర్చకులు పీఠాధిపతులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శింగరకొండలో గల హరహర గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పీరాధిపతులు మాట్లాడుతూ హిందువులందరూ గోమాతను పూజించాలన్నారు. గోశాల సుబ్బారావు బృందం పీఠాధిపతులను సన్మానించారు. తదుపరి అద్దంకి పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, పోలేరమ్మ దేవాలయం, కాళికా కమఠేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట విశ్వ కుటుంబ ధర్మ పరిరక్షణ అఖారా ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ వాకా వెంకట బాలగంగాధర్, చావా రామకృష్ణ, యామర్తి వెంకటేశ్వర్లు, అంకం నాగరాజు, గోశాల సుబ్బారావు, చెన్నుపల్లి శ్రీనివాసాచారి, పాపారావు, బ్రహ్మనందం, తదితరులున్నారు.