ఇంటింటికా..మేము రాలేం.. | - | Sakshi
Sakshi News home page

ఇంటింటికా..మేము రాలేం..

Jul 2 2025 5:33 AM | Updated on Jul 2 2025 5:33 AM

ఇంటిం

ఇంటింటికా..మేము రాలేం..

సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు– ఇంటింటికి తేదేపా’ పేరుతో బుధవారం నుంచి కూటమి ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారానికి దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ఇంటింటికి వెళ్లడంలో ఇబ్బందులు తప్పవని పచ్చపార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు.

హామీలకు మంగళం

ఎన్నికల సమయంలో సూపర్‌సిక్స్‌ మాటున ఇచ్చిన వందలాది హామీలలో ఒకటి రెండు మినహా చంద్రబాబు సర్కార్‌ నెరవేర్చలేదు. అవి కూడా పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. ఎన్నికల్లో ఓట్లేయించుకొని గద్దెనెక్కాక వంచిచడంపై జనం మండిపడుతున్నారు. రెండో ఏడాది ఖరీఫ్‌ నడికొంటున్నా అన్నదాత సుఖీభవ ఇవ్వలేదు. మహిళలకు ఉచిత బస్సు హామీ ఊసేలేదు. 20 లక్షల ఉద్యోగాలన్నా ఒక్క ఉద్యోగం రాలేదు. నిరుద్యోగ భృతి నీటిమూటగా మారింది. మహిళలకు ప్రతినెలా రూ.1500 ఇస్తామన్న హామీని అటకెక్కించారు. ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కూటమి ఇప్పుడు హామీలను అటకెక్కించడంపై పేద, మధ్యతరగతి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.

పతాక స్థాయిలో అవినీతి

మరోవైపు చంద్రబాబు పాలనలో అవినీతి, అక్రమాలు పతాక స్థాయికి చేరాయి. ఇసుక, బుసక, గ్రానైట్‌, గ్రావెల్‌ను ట్రిప్పుల లెక్కన విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. పేదల కడుపుకొట్టి చౌక బియ్యాన్ని ఒక్కొక్క ప్రజాప్రతినిధి నెలకు రూ.25 లక్షలకు అమ్ముకుంటున్నారు. రెడ్‌బుక్‌ పాలనను తెరపైకి తెచ్చి హత్యలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు అంటూ ప్రతిపక్ష పార్టీలతోపాటు ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారు. ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు. మొత్తంగా కూటమి ఏడాది పాలన ప్రజాకంఠకంగా మారడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లేయించుకొని వంచించారని మండిపడుతున్నారు.

పార్టీ శ్రేణుల్లో అంతర్మథనం

ఎన్నికల్లో మాటలు చెప్పి ఓట్లేయించుకొని హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్న విషయం పచ్చ ప్రజాప్రతినిధులు, నేతలకు తెలుసు. ఈ సమయంలో ప్రచార ఆర్భాటంగా ఇంటింటికి వెళితే ప్రజల నుంచి చీవాట్లు ఖాయమని చాలామంది పచ్చనేతలు భయపడుతున్నారు. ప్రజలు నిలదీస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి. దీంతో జనంలోకి వెళ్లి ఇరుకున పడతామని, హామీలు కొన్నైనా నెరవేర్చాక వెళితే బాగుంటుందని చాలా మంది పచ్చనేతలు పేర్కొంటుండటం గమనార్హం. తల్లికి వందనం ఒక్కటే ఇప్పటివరకూ ఇచ్చిన పథకమని అది కూడా చాలామందికి ఇంకా డబ్బులు పడలేదని ఈ పరిస్థితిలో జనంలో కోపం ఉందని ఒక టీడీపీ నేత చెప్పారు. ఇప్పటికీ తల్లికి వందనాన్ని అమ్మ ఒడిగానే ప్రజలు పిలుస్తున్నారని మరో పచ్చనేత చెప్పారు. కొన్ని పథకాలైనా నెరవేర్చాక జనంలోకి వెళ్లాలని, ఇప్పుడు వెళ్లడం వల్ల ఇబ్బందులు తప్పవని మరో టీడీపీ నేత పేర్కొన్నారు. మొత్తంగా హామీలు నెరవేర్చకుండా ఏడాదిలోనే జనంలోకి వెళ్లడం సరికాదని ఎక్కువమంది పచ్చనేతలు అభిప్రాయపడుతున్నారు.

నేటి నుంచి సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో కూటమి ప్రచారం ఏడాదిలో ఏమీ చేయకుండానే చేసినట్లు ఆర్భాటం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు గాలికి జనంలోకి వెళ్లెందుకు జంకుతున్నపచ్చనేతలు

సూపర్‌సిక్స్‌ పేరుతో వంచన

అడ్డుఅదుపూ లేని పచ్చదోపిడీ

జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పేదల కడుపుకొట్టి రేషన్‌ బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. గ్రానైట్‌, గ్రావెల్‌ను ఎక్కడికక్కడ అమ్ముకుంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ, అటవీ భూములను కబ్జా చేస్తున్నారు. వీధివీధినా బెల్టు షాపులు పెట్టి ప్రజలను తాగుడుకు బాసిసలను చేస్తున్నారు.

అన్నదాత సుఖీభవ పేరుతో రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండో ఖరీఫ్‌ సీజన్‌ వచ్చినా జిల్లాలోని 1,92,037 మంది రైతులకు ఇవ్వాల్సిన రూ.384,06 కోట్లలో పైసా ఇవ్వలేదు.

తల్లికి వందన పేరుతో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామన్నారు. జిల్లాలోని 2,35,654 మందికి రూ.353.48 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా కొందరికే ఇచ్చి చాలామందికి ఎగనామం పెట్టారు.

నెలకు రూ.3 వేలు నిరుద్యోగభృతి అన్నారు. జిల్లాలో 4,77,557 కుటుంబాల పరిదిలో ఇంటికొక్కరు అనుకున్నా వారందరికి చెల్లించాల్సిన రూ.143. 26 కోట్లలో పైసా ఇవ్వలేదు.

మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణమన్నారు. జిల్లాలో ఉన్న ఆర్టీసీ బస్సుల ప్రకారం రోజూ 90 వేలమంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో సూపర్‌సిక్స్‌ పేరుతో ఇచ్చిన వందకు పైగా హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు. జిల్లాలో అభివృద్ధిని పట్టించుకోలేదు.

మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇస్తామన్నారు. జిల్లాలో 19 నుంచి 59 ఏళ్లవయస్సు వారు 6,61,841 మంది ఉండగా వీరందకి ఏడాదికి రూ.11,913 కోట్లు ఇవ్వాల్సిఉన్నా దాని ఊసే మరిచారు.

ఏడాదికి మూడు వంట గ్యాస్‌ సిలిండర్లు అనిచెప్పి జిల్లాలో మొత్తం 4,60,836 గ్యాస్‌ కనెక్షన్‌లు ఉండగా మూడు ఉచిత సిలిండర్లకు ఒక్కొక్కరికి రూ.2,700 చొప్పున ఇవ్వాల్సి వుంది. కానీ ప్రభుత్వం 3 లక్షల మందిని మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేసి చేతులు దులుపుకుంది.

ఇంటింటికా..మేము రాలేం.. 1
1/1

ఇంటింటికా..మేము రాలేం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement