
నీటి గుంతలో జారి పడి వ్యక్తి మృతి
ఇంకొల్లు(చినగంజాం): ప్రమాదవశాత్తు కాలు జారి నీటి గుంతలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పావులూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. బంధువులు, పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన గుంజి చిన వెంకటరావు(47) శనివారం ఉదయం బహిర్భూమికి వెళ్లి చాలాసేపటి వరకు తిరిగి రాలేదు. ఇంట్లోని వారికి అనుమానం వచ్చి వెతికారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. సమీపంలోని నీటి గుంతలో పడి వెంటకరావు చనిపోయాడని తెలిసింది. ఎస్‌ఐ జి.సురేష్ ఆధ్వర్యంలో వెంకటరావు మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. వెంకటరావు భార్య శివపార్వతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని మార్కెట్ యార్డు చైర్మన్ వెంకటరావు కోరారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

నీటి గుంతలో జారి పడి వ్యక్తి మృతి