వరి సాగుపై అవగాహన కలిగి ఉండాలి | Sakshi
Sakshi News home page

వరి సాగుపై అవగాహన కలిగి ఉండాలి

Published Mon, Dec 4 2023 2:44 AM

రైతులకు వరిసాగుపై మెలకువలు 
అందిస్తున్న కృష్ణవేణి  - Sakshi

ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ కృష్ణవేణి

బాపట్ల: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించి 60 ఏళ్లు పూర్తి చేసుకుని డైమండ్‌ జూబ్లీ వేడుకలు సందర్భంగా రైతులకు అవగాహన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. మండలంలోని జమ్ములపాలెం, కంకటపాలెం, నరసాయపాలెం, అప్పికట్ల ప్రాంత రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 2023లో విడుదలైన బీపీటీ 2876, బీపీటీ 2841 వంగడాలు గురించి రైతులకు వివరించారు. ఉప్పునీటి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ పి.ప్రసూనాదేవి ఆధ్వర్యంలో ఉప్పునేల, చౌడు భూములు పునరుద్ధరణ పద్ధతులు, మట్టి నమూనా సేకరణపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్‌ ఎన్‌.సాంబశివరావు, డాక్టరు మృదుల పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement