ప్రత్యామ్నాయ పంటలుగా అపరాలు | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటలుగా అపరాలు

Published Sun, Dec 3 2023 1:40 AM

మాట్లాడుతున్న ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఓబయ్య  - Sakshi

ఏరువాక శాస్త్రవేత్త ఓబయ్య

అద్దంకి: సాగర్‌ నీరు లేనందున వరి పంటకు ప్రత్యామ్నాయంగా అపరాల పంటలను సాగు చేసుకోవాలని బాపట్ల ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎంసీ ఓబయ్య సూచించారు. మండలంలోని ధర్మవరం, కలవకూరు, శంఖవరప్పాడు రైతు భరోసా కేంద్రాల్లో శనివారం రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఓబయ్య మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో అపరాల సాగు చేసి లాభాలు పొందవచ్చన్నారు. విత్తన శుద్ధి చేసుకోవడం తప్పనిసరని చెప్పారు. డిప్యూటీ డైరక్టర్‌ విజయనిర్మల మాట్లాడుతూ రానున్న మూడు రోజుల్లో తుఫాన్‌ కారణంగా అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. లోతట్టు పొలాల రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏఓ కొర్రపాటి వెంకట కృష్ణ మాట్లాడుతూ యాప్‌ ఓపెన్‌ అయిందని, రబీ సీజన్‌లో ఈ–క్రాప్‌ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారులు, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement