కార్తిక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని | Sakshi
Sakshi News home page

కార్తిక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని

Published Tue, Nov 21 2023 2:14 AM

క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు - Sakshi

కార్తిక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ దీపారాధనలతో ప్రకాశించింది. భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి త్రికోటేశ్వరుని దర్శించుకుని పులకించారు. స్వామికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు నిర్వహించిన అనంతరం భక్తులను స్వామి దర్శనానికి అనుమతించారు . రద్దీ దృష్ట్యా స్వామి మూలవిరాట్‌ అభిషేకాలను నిలిపివేశారు. అభిషేక మండపంలో జరిగిన విశేష అభిషేక పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఆలయం వెనుక ఉన్న రావిచెట్టు వద్ద మహిళలు కార్తిక దీపాలు వెలిగించారు. నాగేంద్రుని పుట్ట, మహానందీశ్వరుడి వద్ద మహిళలు దీపాలు వెలిగించారు. నరసరావుపేట, చిలకలూరిపేటల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపింది. ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి ఏర్పాట్లు పర్యవేక్షించారు.

– పెదకాకాని/ నరసరావుపేట రూరల్‌

1/1

 
Advertisement
 
Advertisement