ఓపెన్‌ స్కూలు దరఖాస్తుకు 26 తుది గడువు | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ స్కూలు దరఖాస్తుకు 26 తుది గడువు

Published Tue, Nov 21 2023 2:14 AM

-

బాపట్ల అర్బన్‌: ఏపీ ఓపెన్‌ స్కూలు పదో తరగతి, ఇంటర్మీడియట్‌ కోర్సులలో దరఖాస్తు చేసుకునేందు కు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 26 చివరి తేది అని బాపట్ల డీఈఓ పి.వి.జె.రామారావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత గల అభ్యర్థులు ఏఐ కేంద్రాలకు వెళ్లి ఒరిజినల్‌ సర్టిఫికెట్లు సమర్పించి, ఫీజు చెల్లించి ప్రవేశం పొందాలన్నారు. పదో తరగతిలో ప్రవేశానికి విద్యార్థులకు 2023 జూన్‌ 06నాటికి 14 ఏళ్ల వయస్సు ఉండాలన్నారు. అడ్మిన్లకు రికార్డు షీటు, టీసీతోపాటు అభ్యర్థి ఆధార్‌ కార్డు, బ్యాంకు అకౌంట్‌, తండ్రి, తల్లి ఆధార్‌ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలని చెప్పారు. ఎటువంటి విద్యార్హత లేకున్నా జనన ధ్రువీకరణ పత్రాలతోపాటు స్వీయ ధ్రువీకరణతో అడ్మిషన్‌ పొందవచ్చని పేర్కొన్నారు. ఇంటర్‌లో ప్రవేశానికి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. పాస్‌ సర్టిఫికెట్‌తోపాటు అభ్యర్థి ఆధా ర్‌ కార్డు, బ్యాంకు అకౌంట్‌ తండ్రి, తల్లి ఆధార్‌ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు పొందుపరచాలన్నారు.

 
Advertisement
 
Advertisement