ఈ రాశివారికి ఈ వారంలో చిరకాల కోరిక నెరవేరుతుంది

Weekly Telugu Horoscope For March 21st To March 27th - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఉద్యోగావకాశాలు నిదానిస్తాయి. అనుకున్న వ్యవహారాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. ఒప్పందాలు కొన్ని వాయిదా వేస్తారు. వ్యాపారాలలో సామాన్య లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. పారిశ్రామికవేత్తలకు శ్రమ తప్పకపోవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. గులాబీ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. పట్టుదలతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. అత్యంత కీలకమైన ఒక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలు విస్తరించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో మీ హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆకుపచ్చ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
వ్యతిరేక పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. గతం నుంచి ఎదురైన సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. కాంట్రాక్టులు అనూహ్యంగా దక్కుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. మిత్రులతో కలహాలు. నేరేడు, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
వ్యూహాత్మకంగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. మిమ్మల్ని వ్యతిరేకించే వారిని సైతం ఆకట్టుకుని, వారి ప్రేమాభిమానాలు పొందుతారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ఆహ్వానాలు రాగలవు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తిపై కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీరు ఆశించిన మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు పైస్థాయి నుంచి పిలుపు రావచ్చు. ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులను కలుసుకుని కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. మనస్సులోని చిరకాల కోరిక నెరవేరుతుంది. ఎంతటి సమస్య ఎదురైనా పట్టుదలతో అధిమిస్తారు. సంఘంలో అందరి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో హోదాలు, గౌరవం పెరుగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు లభించవచ్చు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
పరిస్థితులను క్రమేపీ మార్చుకుంటారు. సోదరులు, మిత్రుల సహాయంతో కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆధ్యాత్మిక వేత్తలను కలుసుకుని మనశ్శాంతి పొందుతారు. ఆస్తుల విషయంలో నెలకొన్న వివాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాల నిర్వహణపై కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలలో అడుగుముందుకు వేస్తారు. పెట్టుబడులు సమకూరే సమయం. ఉద్యోగాలలో చిక్కులు, ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారి ఆశలు కొన్ని నెరవేరతాయి. వారం చివరిలో బంధువుల నుంచి సమస్యలు. అనారోగ్యం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సూర్యారాధన మంచిది.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
బంధువుల ద్వారా కొన్ని చిక్కులు ఎదురైనా పరస్పర చర్చలతో పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా బలోపేతమవుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. అనుకున్న లక్ష్యాలు సాధించేదిశగా ముందడుగు వేస్తారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తొలగుతాయి. పారిశ్రామికరంగాల వారి ప్రయత్నాలలో కదలికలు కనిపిస్తాయి. వారం ప్రారంభంలో మానసిక అశాంతి.  నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. పాతబాకీలు కూడా వసూలవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాల్లో ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. బంధువర్గంతో మాటపట్టింపులు. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో కొన్ని విజయాలు సొంతం చేసుకుంటారు. ఆప్తులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. రుణబాధలు తొలగుతాయి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభాలబాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు ఊరిస్తాయి. రాజకీయవర్గాలకు పట్టింది బంగారమే అన్నట్లుగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కీర్తిప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. ఒక సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి ద్వారా ఊహించని రీతిలో ధనప్రాప్తి కలుగుతుంది. విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు వస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరించేందుకు ప్రణాళిక రూపొందిస్తారు. ఉద్యోగాలలో కొన్ని హోదాలు దక్కవచ్చు. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. వారం చివరిలో అనారోగ్యం. నిర్ణయాలలో మార్పులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. బంధువులతో తగాదాలు క్రమేపీ తొలగుతాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యతిరేకులను కూడా ఆకర్షిస్తారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి తెచ్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. భాగస్వాములు మీ సమర్థతకు ప్రశంసలు కురిపిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు, ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.  కనకధారాస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి అనుకూలించి రుణబాధలు తొలగుతాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. మిత్రుల నుంచి అందిన సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు కొంతమేర విస్తరిస్తారు. ఉద్యోగాలలో పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top