ఈ వారంలో ఈ రాశి వారికి శ్రమ తప్పదు

Weekly Telugu Horoscope For February 7th To February 13th 2021 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దక్కవచ్చు. ఆర్థికంగా కొంత ప్రగతి కనిపిస్తుంది. నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తులు కొనుగోలులో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. పారిశ్రామికవర్గాలకు విజయాలు వరిస్తాయి. వారం ప్రారంభంలో ప్రయాణాలు. అనారోగ్య సూచనలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు సానుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తుంది. అవసరాలకు తగినట్లుగా డబ్బు అందుకుంటారు. భూవివాదాలు పరిష్కారదశకు చేరతాయి. మీ ఆలోచనలు మిత్రులతో పంచుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. సమస్యలు ఎదురైనా అత్యంత నేర్పుగా అధిగమిస్తారు. వ్యాపారాలు గతం కంటే కొంత మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. బంధువులతో విభేదాలు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్తగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు, సూచనలు పాటిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యతిరేకులను అనుకూలురుగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభ సూచనలు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. సోదరులు, సోదరీలతో కష్టసుఖాలు పంచుకుంటారు. భూవివాదాలు కొలిక్కి వచ్చి ఊపిరిపీల్చుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వాహనయోగం. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు సఫలం. కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. కుటుంబసమస్యల నుంచి కొంత గట్టెక్కుతారు. పరిశోధకుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలలో లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగులకు మరింత అనుకూల సమయం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. అవసరాలు పెరిగినా సమయానికి డబ్బు అందుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తుల విషయంలో సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు మరింత పెరుగుతాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొన్ని పదవులు సైతం దక్కవచ్చు. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
మధ్యలో కొన్ని అవాంతరాలు, సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజకనంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలలో కొంత అనుకూలత రావచ్చు. ఇంటి నిర్మాణాలకు ప్రణాళిక రూపొందిస్తారు. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఉన్నతస్థాయి నుంచి ప్రోత్సాహం. కళారంగం వారి ఆశలు ఫలించే సమయం. వారం మధ్యలో బంధువర్గం నుంచి ఒత్తిడులు. శ్రమ తప్పదు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యం చికాకు పరుస్తుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. గృహ నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. వ్యాపారాలలో సామాన్యలాభాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు, ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు చికాకులు, సమస్యలు తప్పకపోవచ్చు. వారం మధ్యలో వాహనయోగం. ధనప్రాప్తి. గులాబీ, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబంలో సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. వివాహయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. ఎరుపు, చాక్లెట్‌ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. కొన్ని సమస్యలు ఎవరి ప్రమేయం లేకుండా పరిష్కరించుకుంటారు. ఒక కోర్టు వ్యవహారంలో విజయం సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం, ఒత్తిడులు తగ్గుతాయి. రాజకీయవర్గాలు, కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. పసుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. రాజకీయవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం చివరిలో మిత్రుల నుంచి ఒత్తిడులు. కుటుంబంలో చికాకులు. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉండి రుణబాధలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు తిరిగి ప్రారంభిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. కళాకారులు, రాజకీయవేత్తలకు ఉత్సాహవంతమైన కాలం. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఏ పని చేపట్టినా విజయవంతమే. ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక సంఘటన మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఊహించని ఒక వ్యక్తి ద్వారా కొంత ధనలబ్ధి కలిగే అవకాశం. వ్యాపారాలు సజావుగా సాగడంతో పాటు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితికి చేరుకుంటారు. పారిశ్రామికవర్గాలు, కళాకారులకు ఆశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీవేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

-సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top