వారంలో ఈ రాశివారు ఆత్మీయుల ప్రేమ పొందుతారు

Weekly Telugu Horoscope For February 14th To February 20th 2021 - Sakshi

మేషం:
ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. అయితే ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులకు మీ ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తీరే సమయం. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృషభం: 
వ్యయప్రయాసలు ఎదురైనా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఇష్టమైన మార్పులు జరిగే వీలుంది. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. బంధువులతో విభేదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

మిథునం: 
కొన్ని ముఖ్యమైన పనులు నెమ్మదించినా పట్టుదలతో పూర్తి చేస్తారు. మీ ఆశయాలు కొన్ని నెరవేరతాయి. కుటుంబంలో మీ అభిప్రాయాలకు గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు కొల్కిక్కి వచ్చి ఊరట చెందుతారు. ఇంటి నిర్మాణయత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో శ్రమానంతరం ఫలితం ఉంటుంది. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్య సూచనలు. ధనవ్యయం. నేరేడు, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: 
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. అనుకున్న వ్యవహారాలు కొంత కష్టసాధ్యమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఒక కేసు తుదిదశకు చేరుకుంటుంది. వివాహ యత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు అనుకున్న విధంగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగినా తిరిగి యథాస్థితికి చేరుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం ప్రారంభంలో సోదరులతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. తెలుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అష్టలక్ష్మీస్తోత్రాలు పఠించండి.

సింహం:
మధ్యలో కొన్ని అవాంతరాలు, సమస్యలు ఎదురైనా లెక్కచేయక ముందుకు సాగుతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో మిత్రుల సహాయం అందుతుంది. ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో అంగీకారానికి వస్తారు. చిన్ననాటి మిత్రులతో మనస్సులోని భావాలను పంచుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

కన్య
కొత్త పనులు చేపట్టి సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. యుక్తితో ఒక ప్రధాన సమస్య నుంచి బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు జరుగుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

తుల
ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు క్రమేపీ పరిష్కరించుకుంటారు. కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలపై సంప్రదిస్తారు. భూవివాదాలపై ఒక అంగీకారానికి వస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నాలు సఫలమవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వారం ప్రారంభంలో సోదరుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. అనారోగ్యం. నీలం, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.

వృశ్చికం
ప్రారంభంలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. శ్రమతో సతమతమవుతారు. అయితే క్రమేపీ వీటిని అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మిత్రులు, బంధువులతో తగాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు మరింత వేగవంతం కాగలవు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు నూతనోత్సాహం. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు
ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పలుకుబడి పెంచుకుంటారు. చిన్ననాటి మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. మీలోని భావాలను కుటుంబసభ్యులతో పంచుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలలో కొంత ప్రగతి కనిపిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి.  ఇంటి నిర్మాణయత్నాలు తిరిగి ప్రారంభిస్తారు. సోదరులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలలో లాభాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభించే వీలుంది. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. గులాబీ, తెలుపు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మకరం
ఈవారం ముఖ్యమైన పనుల్లో కొంత జాప్యం తప్పదు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తుల విషయంలో సోదరులతో విభేదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు కొన్ని చేజారి నిరాశ చెందుతారు. ఇంటి నిర్మాణాలు ప్రతిబంధకాలతో నిలిపివేస్తారు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలలో సామాన్యలాభాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగి ఉక్కిరిబిక్కిరి కాగలరు. రాజకీయవర్గాలకు కొంత గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. స్వల్ప ధనలాభం. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కుంభం
ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగుపడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులు ఊహించని అవకాశాలు సాధిస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయవర్గాల ఆశలు కొంతమేర ఫలిస్తాయి. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. బంధువులతో తగాదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

మీనం
ఏ వ్యవహారమైనా నేర్పుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలపై దృష్టి సారిస్తారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. వివాహాది శుభకార్యాలపై సంప్రదింపులు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. వ్యాపారాలు లాభాలలో నడుస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, శ్రమ తగ్గుతాయి. పారిశ్రామికవర్గాలకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top